నాన్నతో విషయాలన్నీ చర్చిస్తాను

పిల్లలు, తల్లితండ్రుల మధ్య ముఖ్యంగా  స్నేహభావం, సాన్నిహిత్యం  ఉండాలని ప్రముఖ నటి దీపికా పదుకొనె అభిప్రాయపడ్డారు. పిల్లలు తమ తల్లితండ్రులకు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చితీరాలని ఆమె అన్నారు.

పెద్దలు, పిల్లల సంబంధాలపై దీపిక మాట్లాడుతూ తన తల్లితండ్రులతో తాను ఎంతో సన్నిహితంగా ఉంటానని, తన తండ్రితో అన్ని విషయాలూ చర్చిస్తానని చెప్పారు. మా మధ్య ఉన్నదల్లా స్నేహభావం ఎక్కువని, అందుకే ఆహ్లాదకర వాతావరణం నెలకొందని చెప్పారు. ఆ అనుభవం తాను చెప్తున్న మాట పిల్లలు, పెద్దల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే మైత్రీ భావం ఉండాలని అన్నారు. తమ మధ్య సంబంధాలు తెరచిన పుస్తకంలా ఉన్నప్పటికీ తాను తన పెద్దలకు ఇవ్వవలసిన మర్యాద ఇస్తూ వాళ్ళు చెప్పేదానిని స్వీకరిస్తానని అన్నారు. తన విషయాలేవీ పెద్దల దగ్గర దాచనని, భవిష్యత్తులో తన పిల్లలు తమ దగ్గర ఏవైనా దాచినట్టు తెలిస్తే తాను చాలా బాధపడతానని చెప్పారు. 

తాజాగా ఒక సినిమాలో తాను బెంగాలీ అమ్మాయి పాత్ర  పోషిస్తున్నట్టు చెప్తూ తనకు కొంచం కొంచం బెంగాలీ వచ్చునని, తన నిజ జీవితంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ శాతం ఇంగ్లీష్ మాట్లాడుతానని చెప్పారు.  కొంకణి చాల తక్కువగా మాట్లాడుతానని చెప్పారు. 

కోల్కతాలో జరుగుతున్న షూటింగ్ విషయాలు చెప్తూ కోల్కతా ప్రజలు ఎంతో సాదరంగా తనను స్వాగాతిన్చారని చెప్పారు. షూటింగ్ సమయంలో వాళ్ళు ఎప్పుడూ తమకు ఎలాంటి అంతరాయం కలిగించలేదని చెప్పారు. కోల్కతాలో తాను ఎక్కువగా చైనీస్ ఫుడ్, మోమోస్ తిన్నానని, అక్కడి వంటకాలు బాగున్నాయని దీపికా తెలిపారు.

 

Send a Comment

Your email address will not be published.