నాన్నతో షూటింగ్ అంటే...

రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జోడీగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘బ్రూస్‌లీ’ – ది ఫైటర్ …. .పాటల ఆవిష్కరణ హైదరాబాదులో అక్టోబర్ రెండో తేదీన కనుల విందుగా జరిగింది. ఈ చిత్రానికి సంగీతం తమన్.

ఈ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీన విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ నాన్న (చిరు)తో తొలి షాట్ చిత్రీకరించిన రోజును ప్రస్తావిస్తూ ఈ చిత్రంలో ఆయన కనిపించేది ఐదు నిమిషాలే అయినా, చిత్రానికి బాగా ఉపయోగపడుతుందన్నారు.

చిన్న పాత్రలో కనిపించడానికి నాన్న ఒప్పుకుంటారనుకోలేదని, తమ చిత్ర బృందం నుంచి నాన్నకు ధన్యవాదాలు చెబుతున్నాను అని రామ్ చరణ్ అన్నారు. అయినా ఆ మాట చిన్నదాని, తక్కువ సమయంతో ఇంత క్వాలిటీతో తను ఇప్పటివరకూ చిత్రం చేయలేదన్నారు. దర్శకులు శ్రీనువైట్ల ఎంతో క్లారిటితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో పూర్తి చేశామన్నారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా చిత్రీకరణ సజావుగా సాఫీగా సాగేలా సహకరించారని చెప్పారు. ఈ చిత్ర కథంతా అక్కా తమ్ముడు మధ్య జరుగుతుందని, అక్క పాత్రలో కృతి నటించారని చరణ్ చెప్పారు. కథానాయిక పాత్రలో రకుల్ తనకు పోటీగా చేసిందని తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా ‘బ్రూస్ లీ’ సాంగ్ ఒక్కటే మిగిలి ఉందని, ఈ పాట చిత్రీకరణ కూడా పూర్తి చేసి ఈనెల 16న దసరా కానుకగా విడుదల చేస్తామని చరణ్ అన్నారు.

Send a Comment

Your email address will not be published.