‘నాన్న నేను, నా బాయ్ ఫ్రెండ్స్’

Nanna-Nenu-Na-Boyfriendsభాస్కర్ బండి దర్శకత్వంలో : హెబ్బా పటేల్, తేజస్వి, రావు రమేష్, అశ్విన్ బాబు, పార్వతీశం, నోయెల్, సన తదితరులు నటించిన చిత్రం ‘నాన్న నేను, నా బాయ్ ఫ్రెండ్స్’. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర. సాయికృష్ణ కథ అందించగా ప్రసన్న కుమార్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. భాస్కర్ బండి దర్శకత్వం వహించడం ఇదే మొదటిసారి. దిల్ రాజు బ్యానర్ పై ఈ చిత్రం విడుదల అయ్యింది.

సినిమా కథాపరంగా రాఘవరావు పాత్రలో రావు రమేష్ నటించారు. ఆయనకు పెళ్లయిన ఐదేళ్ల తర్వాత పుట్టిన కూతురే పద్మావతి. ఈ కూతురు పాత్రలో నటించిన తార హెబ్బా పటేల్. కూతురంటే రావు రమేష్ కి చాలా చాలా ఇష్టం. ప్రాణమూనూ. అయితే జాతకం ప్రకారం వీరికి ఏ మాత్రం పడదు అని ఒకరు చెప్తారు. దానితో కూతురితో గొడవపడటం దేనికనుకుని తండ్రి ఆమెకు ఏది ఇష్టమో అలాగే పెంచుతాడు. ఏదీ అడ్డు చెప్పడు. కూతురు ఓ ఉద్యోగంలోకి చేరడంతోనే డానికి పెళ్లి చేయాలని తల్లీతండ్రీ అనుకుంటారు. కానీ కూతురు ఆలోచన మరోలా ఉంటుంది. పెళ్లి తప్పించుకోవడానికి తాను ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్తుంది పద్మావతి. కానీ అక్కడితో ఆగకుండా తాను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటుంది. ఓ ముగ్గురు యువకులను ఎంచుకుని వారిలో తనకు సరిపోయే కుర్రాడిని భర్తగా చేసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ప్రేమాయణం పెళ్లి వ్యవహారం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలి. తండ్రి పాత్రలో రావు రమేష్ ఎలా కథనాన్ని నడిపించారో తెలుస్తుంది.

కథ సాధారణమైనదే అయినా ఈ సినిమా అంతా పూర్తిగా రావు రమేష్ నటనపైనే ఆధార పడింది. ఆయన ప్రతిభ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించక్కర లేదు.

హాస్యం కొన్ని చోట్లే బాగుంది. కొన్ని సన్నివేశాలు మరీ అనామకంగా ఉన్నాయి.

క్లైమాక్స్ బాగున్న ఈ చిత్రంలో హెబ్బ పటేల్ నటన యావరేజ్ గా ఉంది. గ్లామర్ పరవాలేదు. ముగ్గురు హీరోలలో పార్వతీశం కాస్త నయం. అలాగే అశ్విన్, నోయెల్ కూడా.

శేఖర్ చంద్ర సంగీతం ఓహో అని అనలేం. యావరేజ్ గా ఉంది. సాయికృష్ణ కథలో కొత్తదనం లేదు. ప్రసన్న కుమార్ మాటలు పరవాలేదు.

Send a Comment

Your email address will not be published.