నా గర్ల్ ఫ్రెండ్ తాప్సీ

డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో ఇండియన్ ఓపెన్ లో పురుషుల విభాగంలో డబుల్స్ టైటిల్ విజేత. అతను భారత దేశంలో ఆడటానికే  ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. అతను ఆడే మ్యాచ్ లను తాప్సీ క్రమం తప్పకుండా చూస్తున్నాదట.  ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ అయిన బో మాగెన్ సేన్ తో జత కలిపి మ్యాచ్ ఆడినప్పుడు 26 ఏళ్ళ చస్మ బద్దూర్ స్టార్ తాప్సీ  హాజరై బో సంపాదించే ప్రతీ పాయింట్ అప్పుడు చప్పట్లు చర్చి తన ఆనందాన్ని వ్యక్తం చేసిందట. మ్యాచ్ అయిన తర్వాత విలేఖరులు బోను కలిసి తాప్సీ విషయం అడగ్గా తానిప్పుడే ఏదీ చెప్పలేనని అన్నాడట. కానీ బ్యాడ్మింటన్ వర్గాల్లో వీరి మధ్య డేటింగ్ విషయం బాగా నలిగింది. గత ఏడాది జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సమయంలో వీరిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. లక్నో కు చెందిన అవదే వారియర్స్ జట్టుకు బో ప్రాతినిద్యం వహించగా తాప్సీ హైదరాబాద్ హాట్ షాట్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్.
33 ఏళ్ళ డానిష్ స్టార్ బో తో తాప్సీ ఎలాంటి సంబంధాన్ని వెల్లడించనప్పటికీ  కొన్ని నెలలక్రితం వీరిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను బో ట్విటర్ లో అప్లోడ్ చేయడమే కాకుండా ఆ ఫోటో కింద అతను మై బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్  తాప్సీ అని రాసుకున్నాడు. అంతే కాదు తాప్సీ నటించిన ఒక సినిమా షూటింగ్ సెట్స్ కు వచ్చి ఆమెను బో కలిసివాడని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.