నా నటనను మెరుగుపరిచింది

Actress Pooja Hegde @ Oka Laila Kosam Platinum Disc Function Stills
Actress Pooja Hegde @ Oka Laila Kosam Platinum Disc Function Stills

దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత నటి పూజా హెగ్డే తిరిగి టాలీవుడ్ లో కనిపించింది. ఈ మధ్యే విడుదల అయిన దువ్వాడ జగన్నాథం డీ జే చిత్రంలో ఆమె అల్లు అర్జున్ సరసన నటించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నాకెంతో ఆనందంగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. అది నాకు ఆనందం. పైగా నా నటన బాగుందని చెప్పడం వింటున్నాను” అని చెప్పింది.

ముకుంద చిత్రం తర్వాత పూజా హెగ్డేకు చాలా అవకాశాలే వచ్చాయి. అయితే తానూ ఓ హిందీ చిత్రానికి కమిట్ అవడంతో ఆ అవకాశాలను వదులుకున్నానని ఆమె తెలిపింది. హారీష్ కూడా తనకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో ఒక అవకాశం ఇచ్చారని, అయితే తానూ ఒప్పుకున్నా హిందీ ఫిలిం పూర్తి అవుతే తప్ప మరో చిత్రం చేయలేనని కచ్చితంగా చెప్పానని ఆమె చెప్పింది.

26 ఏళ్ళ పూజా మాట్లాడుతూ తనకు టాలీవుడ్ లో వర్క్ చేయడం ఎంతో ఇష్టమని, కారణం అక్కడి కల్చర్, ప్రజలు తనకెంతో ఇష్టమని చెప్పింది.

తన మొదటి రెండు చిత్రాలు ట్రెడిషనల్ చిత్రాలు కావడంతో వాటికి భిన్నంగా ఏదో ఒకటి చేయాలనుకున్నానని, అప్పుడు దువ్వాడ జగన్నాథం చిత్ర కథను దర్శకుడు హారీష్ తనకు చెప్పారని, పైగా గ్లామరస్ పాత్ర అనికూడా చెప్పడంతో ఇక వెంటనే ఒప్పేసుకున్నానని ఆమె చెప్పింది. అంతేకాకుండా తనకు అల్లు అర్జున్ తో కలిసి నటించాలనే కోరిక ఉందని, అది ఈ చిత్రంతో తీరినట్టు తెలిపింది. ఈ చిత్రంతో తానూ ఎన్నో నేర్చుకున్నానని, ఇందులో ఒక్క నీరసమైన సన్నివేశమూ లేదని, తన నటన మెరుగుపదినట్టు పూజా హెగ్డే చెప్పింది.

Send a Comment

Your email address will not be published.