నిఖిల్ కు పదేళ్ళు

నటుడు నిఖిల్ తన సినీ జీవితంలో పదేళ్ళు పూర్తి చేసుకున్నాడు. హ్యాపీ డేస్ మొదలుకుని నిన్నమొన్నటి “కేశవ” చిత్రం వరకు నటించిన పలు చిత్రాలలో స్వామి రా రా చిత్రం నిఖిల్ కెరీర్ లో ఓ పెద్ద మలుపే అని చెప్పుకోవాలి. నిఖిల్ కథల ఎంపికలో తగు జాగర్తలు తీసుకుంటాడు అనే పేరు ఉంది.

నిఖిల్ మాట్లాడుతూ స్వామి రా రా చిత్రం తన నట జీవితంలో ఓ గొప్ప మలుపు అని, ఇందులో అనుమానం లేదని అన్నాడు. స్వామి రా రా చిత్రం ఓ ప్రయోగాత్మక చిత్రమని, అయితే అదే సమయంలో ప్రేక్షకులు తన నుంచి ఏమిటి ఆశిస్తున్నారో తెలిసిందని అన్నాడు. ఓ ఇమేజ్ కి పడిపోవడం అనేది పెద్ద ట్రాప్ అని అంటూ కొన్ని వైఫల్యాల తర్వాత తానూ ఈ నిజాన్ని తెలుసుకున్నాను అని చెప్పాడు. స్వామి రా రా చిత్రం తర్వాత దాదాపు ఇరవై మంది దాదాపు ఒకే రకమైన సబ్జెక్టుతో తన వద్దకు వచ్చారని, అలాగే కార్తికేయ చిత్రం విషయంలోనూ జరిగినట్టు తెలిపాడు నిఖిల్.

గత కొన్ని చిత్రాల విషయాల ఎంపికలో నిఖిల్ ఎన్నో జాగర్తలు తీసుకున్నాడు. కేశవా చిత్రం పెట్టిన బడ్జెట్టు కన్నా రెండింతలు వసూలు చేసి పెట్టిందని అంటూ తానిప్పుడు ఒత్తిడిలో ఉన్నానని, ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడినట్టు చెప్పాడు. అందుకు కారణం తన ఇమేజ్ పెరగడమేనని అన్నాడు.

తానూ తన ఇమేజ్ ని నిలుపుకోవడానికి అంకిత భావంతో కృషి చేయకతప్పదని అన్నాడు. ప్రేక్షకులు తన నుంచి మంచి కథ ఉన్న చిత్రాలు ఎర్డురు చూస్తారని తెలుసనీ, వారిని ఏదో ఒక కథతో విసిగించదలచుకోలేదని అన్నాడు.
గత పదేళ్ళలో మీలో ఏదైనా మార్పు ఉందా అని అడిగితే వ్యక్తిగా తనలో ఎలాటి మార్పు లేదన్నాడు. తానూ నటుడిగా మంచిగా వర్క్ చేయాలనుకున్న విషయంలో కొంత మారానని అన్నాడు. ఓ దర్శకుడు తనకు కథ చెప్తున్నప్పుడు ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకుంటానని అన్నాడు నిఖిల్. అదొక్కటే తనలో వచ్చిన మార్పు అని అతను అన్నాడు.

Send a Comment

Your email address will not be published.