నిర్ణయం నాదే

నటుడిగా ఓ స్థాయికి చేరుకున్నాను….అందుకే ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాను అని ప్రకాష్ రాజ్ చెప్పారు.

Prakash Rajమన ఊరి రామాయణం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తనకు ఏది నచ్చితే అది చేస్తాను అని అన్నారు. ఇతరులు ఏదో చేసింది తాను చేయనని, తనకు నచ్చితేనే ఏదైనా చేస్తానని చెప్పారు. తానూ అంతకు ముందు సమర్పించిన రెండు చిత్రాలు కమర్షియల్ గా రాణించకపోవచ్చు కానీ తానందుకు బాధ పడలేదని అన్నారు. దర్శకత్వాన్ని కొనసాగిస్తానని ఆయన అన్నారు.

తాను ఖర్చుపెట్టిన డబ్బులు రాకపోయినందుకు విచారపడటం లేదని అంటూ తాను గురువుగా భావించే ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. బాలచందర్ అబద్ధం అని ఒక సినీమా తీసారట. అది అసలు ఆడలేదు. అట్టర్ ఫ్లాప్. అప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ తో ఆరు నెలలపాటు మాట్లాడలేదట. ఎందుకంటె ఓ చెత్త సినిమా సమర్పించి మూడు కోట్ల రూపాయలు కోల్పోయారట. కనుక కొన్నిసార్లు మనం మంచి పని చేసినా కొంత డబ్బు కోల్పోతామని ప్రకాష్ రాజ్ అన్నారు.

తాను షూటింగ్ కి ఆలస్యంగా వస్తానని, పైపెచ్చుమాటలు రువ్వుతానని కొందరు నిర్మాతలు చేసిన విమర్శలను ఆయన ఖండించారు.

ఓ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకునే ముందు తానుషూటింగ్ కి ఎప్పుడు వచ్చేది వంటివన్నీ స్పష్టంగా చెప్తానని, తానూ తెల్లవారి మూడు గంటలకు నిద్రపోతానని, ఎనిమిదిన్నర – తొమ్మిది గంటల మధ్య లేస్తానని ఎవరికోసమే తాను తన జీవన సరళి మార్చుకోనని ఆయన అన్నారు. తాను చెప్పేది నచ్చిన వాళ్ళు సరేనంటారు…లేదు కాదూ అన్నారంటే అలాగే అని ఊరుకుండి పోతానని అన్నారు. దర్శకుడు క్రిష్ణవంశితో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యా లేదని, తమ మధ్య ఓమారు రెండేళ్ళ పాటు మాటలు లేవని, కానీ ఆయన తన కోసం ఫోన్ చేసి ఓ చిత్రం చేయాలన్నప్పుడు వెంటనే ఒప్పుకున్నానని ప్రకాష్ రాజ్ గుర్తు చేసారు. ఎవరైనా తనతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తే చేస్తానని, అయితే మునుపు చేసిన తప్పులనే రిపీట్ చేస్తే తాను తప్పుకుంటానని అన్నారు. తాను ఓ సినిమాకు ఎంత తీసుకోవాలన్నది తానే నిర్ణయించుకుంటానని, తనకు డబ్బు వ్యవహారాలూ చూసేందుకు మేనేజర్లు లేరని, అంతా తానే చూసుకుంటానని చెప్పారు. ఓ ఫోన్ కాల్ వచ్చినప్పుడు కథం జీతం తదితర విషయాల గురించి తానే మాట్లాడుతానని ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.