నిర్మాతగా శివ బాలాజీ

నటుడు శివ బాలాజీ ఇప్పుడు కొత్త అవతారమెత్తుతున్నారు. .

ఆర్య, అశోక్ గాడి లవ్ స్టోరీ, సాంబ శివ శంభో, దోస్త్ తదితర చిత్రాలలో నటించి ఎందరో అభిమానాన్ని పొందిన శివ బాలాజీ ఇప్పుడు నిర్మాతగా మారారు. ఆయన చేతిలో ఇప్పుడు మంచి స్క్రిప్ట్ దొరకడంతో ఆ కథను వెండితెరకు ఎక్కించాలని శివ బాలాజీ నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర కూడా పోషించనున్నారు. మహేష్ ఉప్పులూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రం పూజా, ఇతర కార్యక్రమాలు ఈ నెల 23వ తేదీ ఆరంభమవుతాయి.

1980 దశకంలో జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీయబోతున్నట్టు శివబాలాజీ అన్నారు. . ఇద్దరు మిత్రుల మధ్య కథ సాగుతుందని, కొత్త కొత్త నటులను పరిచయం చేస్తానని ఆయన అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమా నిర్మించబోతున్నాను అని అంటూ 1980 దశకం లోని బ్యాక్ డ్రాప్ చూపించడానికి అన్ని విధాల ప్రయత్నిస్తామని అన్నారు. మొబైల్ టవర్స్ లేని చోట్లు షూటింగ్ కు ఎన్నుకుంటామని, తాను, అజయ్ మిత్రులుగా నటించాబోతున్నామని చెప్పారు. అయితే ఈ చిత్రంలో తమ సరసన నటించే తారలను ఇంకా ఎంపిక చేయలేదని అన్నారు. హైదరాబాద్ శివారులోను, పోచంపల్లి లోను ఎక్కువభాగం చిత్రీకరణ ఉంటుందని ఆయన తెలిపారు.

Send a Comment

Your email address will not be published.