నీహారిక కొత్త ప్రాజెక్ట్

Niharika1కొణిదెల నీహారిక వెబ్ సిరీసులో ఆవిష్కరించిన ముద్దపప్పు ఆవకాయకు విపరీతమైన ఆదరణతోపాటు లెక్కలేనన్ని లైక్స్ వచ్చాయి. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్తదనం రూచి చూపించింది. ఈ విజయస్ఫూర్తితో ఇప్పుడు నీహారిక మరో కొత్త సిరీస్ కు శ్రీకారం చుట్టింది. దాని పేరు నాన్న కూచి….

దీనికి బ్రహ్మానందపల్లి ప్రణీత్ దర్శకత్వం వహించారు.

ముద్దపప్పు ఆవకాయ సిరీస్ లోనూ ఈ ప్రణీత్ పాత్ర ప్రధానమనైదిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండో సిరీస్ లో నీహారిక తండ్రి నాగబాబు కూడా ఓప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పని సాగుతోంది. ఈ చిత్రంలో ఎక్కడా ఏ ఒక్క లోపమూ కనిపించకుండా అన్ని విధాలా పక్కాగా ఉండాలని చిత్ర యూనిట్ శ్రమిస్తోంది.

ఈ యూనిట్ తరఫున ఒకరు మాట్లాడుతూ, ముద్దపప్పు ఆవకాయ సిరీస్ అద్భుతంగా రూపుదిద్దుకుని విజయవంతమైందని, అలాగే ఇపుపడు ఈ రెండో సిరీస్ కూడా అన్ని విధాల అన్ని వర్గాల వారిని ఆకటుటకోవాలన్న లక్ష్యంతో రూపొందిస్తున్నట్లు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.