రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్ తదితరులు నటించిన నేను శైలజ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రానికి
దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.
రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం బాధ్యతలు కిషోర్ తిరుమలవే.
‘శివమ్’ ఫ్లాప్ అయిన తర్వాత కొంత కాలం ఆగి ఆపైన పండగ చేస్కో అనే సినిమాలో నటించారు. అయితే ఆ చిత్రం కూడా దారుణంగా విఫలమవడంతో రామ్ ఆందోళనలో పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన నటించిన నేను శైలజ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మీద రామ్ కొండంత ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం మనం అడుగుపెట్టిన కొత్త సంవత్సరంలో విడుదల అయిన నేను శైలజ చిత్రానికి మొదటి రోజే మంచి పేరే వచ్చింది.
కథలోకి వెళ్తే…… ఎందరో అమ్మాయిలనను ప్రేమించి విసుగుపుట్టిన రామ్ (హరి పాత్రలో నటించారు) ఇక మళ్ళీ ఆ ప్రేమ వలలో పడకూడదని గట్టిగా అనుకుంటాడు. అయితే అదే సమయంలో ఆయనకు శైలజ (ఈ పాత్రను కీర్తి సురేష్ పోషించారు) ఎదురవుతుంది. రామ్ ఆమెతో ప్రేమలో పడతారు. అయితే ఆయనను ప్రేమించడం లేదని శైలజ చెప్తుంది. కానీ ఈ సారి రామ్ పక్కకు తప్పుకోకుండా ఆమె ప్రేమను పొందడం కోసం శైలజ కుటుంబానికి ఆమె అన్నయ్య సహాయంతో దగ్గరవుతారు. రామ్ ప్రేమ ఎలా పండింది అనేది తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాలి.
ఎమోషన్స్ సన్నివేశాలతో కుర్రకారుని ఆకట్టుకున్న దర్శకుడు కథనాన్ని పరవాలేదు అన్న తీరులోనే ముందుకు నడిపించారు. అయితే క్లాస్ ని ఆకట్టుకోగల ఈ చిత్రం మాస్ ని అంతగా ఆకర్షించకపోవచ్చు.
రామ్ తన పాత్రకు తగిన న్యాయం చేయగా ఆయన సరసన కీర్తి సురేష్ తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. . సత్యరాజ్, ప్రదీప్ రావత్, ప్రిన్స్, శ్రీముఖి, రోహిణి, నరేష్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన పాటలు పరవాలేదు.
మొత్తంమీదైతే ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు.