నేనే రాజు...నేనే మంత్రి

దర్శకుడు తేజ రూపకల్పనలో దగ్గుబాటి రానా – కాజల్ నటించే చిత్రం ప్రేకషకుల ముందుకు రాబొంతోంది. ఈ చిత్రం పేరు – “నేనే రాజు – నేనే మంత్రి” ! ఇదొక రాజకీయ నేపధ్యంలో నడిచే కథ. ఈ చిత్రం నిర్మాణం ప్రస్తుతం హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ చిత్రంలో కాథరీన్ ట్రెసాకూడా కీలక పాత్ర పోషిస్తోంది.

రానా ప్రస్తుతం ఈ చిత్రంపైనే తన దృష్టి కేంద్రీకరించారు. నిర్మాణంలో ఉన్న బాహుబలి చిత్రంలో ఆయన పాత్ర చిత్రీకరణ పూర్తయిపోయింది. ఈ చిత్రం కోసం రానా ఇప్పటికే తేదీలు ఖరారు చేసారు కూడా. ఆయన తేజ తో కలిసి వర్క్ చేయడం ఇదే తొలిసారి. చాలాకాలం తర్వాత దర్శక బాధ్యతలు చేపట్టిన తేజ మేటి స్టార్లతో ముందుకు సాగుతున్నారు. బాహుబలి – 2 కన్నా ముందరే ఈ చిత్రం విడుదల అయ్యేఅవకాశాలు ఉన్నాయి.
2017 జనవరి కల్లా ఈ చిత్ర నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి విడుదల చేయాలని ఉందని తేజ తెలిపారు.

Send a Comment

Your email address will not be published.