‘పటేల్ సర్’

జగపతి బాబు నటన పెట్టని కోట!!
……………………………
patel SIRహీరోగా ఎదిగి ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ అందరి ఆదరణను పొందుతున్న జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ ఓ హీర్రో పాత్రలో నటించిన చిత్రమే “పటేల్ సర్”
రజిని కొర్రపాటి నిర్మాణంలో వాసు పరిమి స్క్రీన్ ప్లే , దర్శకత్వంలో జగపతిబాబుతోపాటు పద్మప్రియ, తన్య హోప్ , సుబ్బరాజు, కబీర్ సింగ్, పృథ్వీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన చిత్రమే పటేల్ సర్. ఈ చిత్రానికి డీజే వసంత్ సంగీతం స్వరపరచగా ప్రకాష్ మాటలు రాసారు.

కథలోకి వెళ్తే,

సుభాష్ పటేల్ పాత్రలో నటించిన జగపతిబాబు ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్. ఆయన వద్ద ఒక బుజ్జిపాప ఉంటుంది. ఆ పాపతో వెళ్తూ డ్రగ్స్ తయారు చేసే ఓ ముఠాలోని సభ్యులను ఒక్కొక్కరిగా చంపుతుంటాడు పటేల్. ఈ మిస్టరీని ఛేదించడానికి కేథరిన్ పాత్రలో నటించిన తన్య హోప్ అనే పోలీసాఫీసర్ ని నియమిస్తారు. ఆమె పటేల్ ఎందుకు హత్యలు చేయిస్తున్నాడో అనే వివరాలు తగు ఆధారాలతో తెలుసుకుంటుంది. కానీ పటేల్ తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అతను చివరిగా చేయబోయే హత్య సమయంలో ఆమె ఆ హత్యలు చేస్తున్నది పటేల్ అని తెలుసుకుంటుంది. మరి పటేల్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు, బుజ్జిపాపకూ ఆయనకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటీ వంటి వివరాలు తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాలి.
టీజర్లోనీ, ప్రోమోల్లోనూ తన ప్రతిభను చూపిన దర్శకుడు వాసు పరిమి కథనంలోనూ పరవాలేదనిపించుకున్నాడు. జగపతి బాబు నుంచి మంచి నటననే చూపించగలిగాడు దర్శకుడు. యాక్షన్ సన్నివేశాలనూ దర్శకుడూ బాగానే చూపించాడు.

జీవితాన్నంతా దేశం అర్పించిన పటేల్ సర్ తన కొడుకు ఆర్మీలో చేరలేదని అతడిని ఇంట్లోనుంచి తరిమేస్తాడు. ఓ దశలో కొడుకు ఆయనకు దగ్గరయ్యేలోపు అతని కుటుంబాన్ని ఓ ముఠా నాశనం చేస్తుంది. దీంతో పటేల్ సర్ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఒక్కొక్కరినీ చంపుతూ వస్తాడు.

జగపతి బాబు నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అద్భుతం. పద్మప్రియ, ఆమని నటనా బాగుంది. తన్య హోప్ నటన గొప్పగా లేదు.
డీజే వసంత్ సంగీతం యావరేజ్.

వారాహి బ్యానర్లో వచ్చినా ఈ చిత్ర నిర్మాణ విలువా ఎక్కడా తగ్గలేదు. బాగుంది. మొత్తం మీద చూడదగ్గ చిత్రమే పటేల్ సర్.

Send a Comment

Your email address will not be published.