పదకొండో అవతారంగా పైసా

దశావతారాలు మాట ఎలా ఉన్నా ఇప్పుడు పదకొండో అవతారంగా తాము చూపిస్తున్న పైసా చిత్రాన్ని చూడమని సుప్రసిద్ధ దర్శకుడు కృష్ణ వంశి తెలిపారు. ఈ నెల 7వ తేదీన విడుదలైన ఈ సినిమాలో యువ కధానాయకుడు నాని, కదానాయకురాలిగా కాథరీన్ నటించారు. నూర్జహాన్ అనే ముస్లిం యువతి పాత్రలో  కాథరీన్ నటించింది. ఆమె కేవలం కళ్ళతో చక్కటి హావభావాలను పలికించింది. మరోవైపు హీరో నాని రోజుకు రెండు వందల రూపాయలకు పని చేసే మోడల్ గా నటించారు. కృష్ణ వంశితో పని చేసే అవకాసం లభించడం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని నానీ చెప్పారు. యెల్లొ ఫ్లవర్ బానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడంలో యూనిట్ సభ్యులు ఎంతో రిస్క్ తీసుకున్నారని నిర్మాత  రమేష్ పుప్పాల చెప్పుకున్నారు. మలేసియా, దుబాయిలలో కొన్ని దృశ్యాలు షూట్ చేసారు. సాయి కార్తిక్ సంగీతం అందించారు. సిని బృందం ఎంత గొప్పగా చెప్పుకున్నా  ఈ చిత్రం మాత్రం యావరేజ్ గా ఉందన్నది యువతరం మాట.

Send a Comment

Your email address will not be published.