పన్నెండేళ్ళ తర్వాత...

Khushbooనటి ఖుష్బూ టాలీవుడ్ లో కొత్త సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించడంతో తెలుగు, తమిళ అభిమానులు బోలెడు మంది తమ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. ఖుశ్బూని ఎవరు మరవగలరు…?

ఆమెను దైవంగా ఆరాధించే తమిళ అభిమానులు ఏకంగా ఆమెకోసం ఓ ఆలయమే కట్టేశారు. సాహసానికి, అందానికి మారుపేరైన ఖుష్బూ ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. త్రిమూర్తులు, కిరాయి దాదా, శాంతి క్రాంతి తదితర చిత్రాలు చేసిన తర్వాత ఆమె తమిళ పరిశ్రమకు వెళ్ళిపోయారు. దాదాపు పన్నెండేళ్ళ గ్యాప్ తర్వాత ఆమె ఇప్పుడు మళ్ళీ తెలుగు పరిశ్రమలోకి పునఃప్రవేశం చేస్తున్నారు. 2006లో ఆమె చివరిసారిగా ఓ తెలుగు చిత్రంలో నటించారు. ఆ చిత్రం పేరు “స్టాలిన్”.

ఇప్పుడు ఆమె నటించబోయేది పవన్ కళ్యాన్ తో. పవన్ కళ్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తయారయ్యే చిత్రంలో నటించడానికి ఆమె ఒప్పందం చేసుకున్నారు.
ఆమె ఈ మధ్య ట్విటర్ లో ఒ పోస్ట్ పెట్టారు –

“ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ట్రస్ట్ యువర్ గుడ్ వర్క్. జాబ్ లెస్ మైండ్స్ విల్ డు ది టాకింగ్. వెరీ హ్యాపీ విత్ ది డెవలప్ మెంట్స్. విల్ షేర్ ఎ వెరీ గుడ్ న్యూస్…థాంక్ యు ఫ్రెండ్స్”
ఈ పోస్ట్ చూడటంతోనే రెండు నిమిషాల కల్లా బోలెడు మంది అభిమానులు ఆమె ప్రకటనను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసారు. ఆమె చేయబోయే చిత్రం వివరాలు కోరుతూ ట్వీట్ చేసారు. ఇప్పుడు ఆమె నుంచి పూర్తి వివరాలకోసం అభిమానులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు…..

Send a Comment

Your email address will not be published.