పవన్ కల్యాణ్ - 25 కోట్లా!

తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దశ తిరిగినట్టే కనిపిస్తోంది. గతంలో అనేక వైఫల్యాల తరువాత దాదాపు చప్పగా చతికిలపదిపోయిన పవన్ ఇప్పుడు పరిశ్రమను శాసించే స్థితికి చేరుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో ఆయన మహేష్ బాబుతో పోటీపడుతున్నాడు. అతను మెగాస్టార్ చిరంజీవి స్థాయికి చేరుకున్నట్టు కూడా పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందు ‘గబ్బర్ సింగ్’, ఇప్పుడు ‘అత్తారింటికి దారేది’ సినిమాలతో ఆయన రేంజ్ మారిపోయిందని, ఇప్పుడు ఆయనకు పట్టిందల్లా బంగారంగా ఉంటోందని కూడా అంటున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరు ప్రసిద్ధ బ్యానర్లకు సంతకాలు చేశారు. పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. ఆయన పారితోషికం ప్యాకేజీ కూడా 25 కోట్ల రూపాయలు దాటిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయన తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది’ విదేశాల్లో కూడా బాగా వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. ఆయన తన దగ్గరకు వస్తున్న నిర్మాతలతో, తనకు లాభాలలో కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఏది ఏమయినా ఆయనే ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో అతి ఖరీదైన, అతి విలువయిన హీరో అని చెబుతున్నారు.

Send a Comment

Your email address will not be published.