ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సెలవుపై ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ జె సూర్యా ఫర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోంది. పవన్ సరసన శృతి హాసన్ నటించే అవకాశ మున్నట్టు సన్నిహిత వర్గాల భోగట్టా. అది ఖాయమైతే గబ్బర్ సింగ్ తర్వాత శృతి హాసన్ పవన్ కళ్యాన్ తో నటించడం ఇది రెండో సారి అవుతుంది. నిజానికి సర్దార్ సింగ్ చిత్రంతోనే శృతి హాసన్ కి మంచి బ్రేక్ లభించినట్టు చెప్పుకోవచ్చు. దర్శకుడు సూర్యా శృతి హాసన్ పేరుని సూచించినట్టు కూడా తెలిసింది. దాదాపుగా చిత్ర యూనిట్ ఈ విషయంలో ఒక తుది నిర్ణయానికి వచ్చినా శృతి హాసన్ ఇంకా ఒప్పందపత్రాలపై సంతకం చేసినట్టు తెలిసింది. మాటలు జరుగుతున్నాయి.