పవన్, రేణుదేశాయ్ లు కలిసే ఉన్నారా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంభందించి చిన్న న్యూస్ వచ్చినా అభిమానులకి పండగే. పవన్ ఇష్టాలు, అభిరుచులు గురించి తెలుసుకోవడం అంతే తెలుసుకోవడం వారికి భలే సరదా. ఇంకా పర్సనల్ లైఫ్ విషయం అయితే చెప్పాల్సిన పని లేదు. అయితే పవన్ మాత్రం ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడడు. తన విషయాలు ఏమన్నా అడుగుతారేమో అని మీడియా కి అస్సలు చిక్కడు. అందుకే పవన్ గురించి వచ్చేగాసిప్స్ కి అంతు ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే నందినితో వివాహం జరిగింది.

అయితే, ఆ తర్వాత బద్రి లో నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వారికి ఒక బాబు పుట్టిన తర్వాత, మొదటి భార్య నందిని పవన్ పై కేసు పెట్టింది. తనకు విడాకులు ఇవ్వకుండానే పవన్ మరో మహిళని వివాహం చేసుకోన్నాడని ఆమె కోర్టుకి ఎక్కింది. పవన్ రేణు ని వివాహం చేసుకోలేదు, సహా జీవనం మాత్రేమే అని నిరూపించడంతో పాటు నందినితో రాజీ పడి ఆమెకి నష్ట పరిహారం చెల్లించడంతో ఆ విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత పవన్ రేణు దేశాయ్ ని వివాహం చేసు కొన్నాడు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు. ఒక బాబు, ఒక పాప. అయితే, గత కొంత కాలం గా పవన్, రేణు దేశాయ్ లు విడి పోయారని, పిల్లల్ని తీసుకొని రేణు అమ్మగారింటికి పుణె వెళ్లిందని ఫిలిం నగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రేణు కి నష్ట పరిహారం ఇవ్వడానికి పవన్ హైదరాబాద్ లో తనకి ఉన్న అపార్ట్ మెంట్స్ ని కూడా అమ్మకానికి పెట్టాడని మీడియా లో ప్రచారం జరిగింది.

హాలీవుడ్ కి చెందిన ఒక భామతో పవన్ సహజీవనం చేస్తున్నాడు. వారికి ఒక పాప కూడా ఉందని తెగ ప్రచారం జరిగింది. అయితే వీటి పై పవన్ ఎప్పుడూ, ఎక్కడా స్పందించలేదు. కనీసం పెదవి విప్పి వాటిని ఖండించ లేదు. దాంతో పవన్, రేణు లు విడి పోయారనే దాదాపు నిజమే అని అభిమానులు భావించారు. అయితే పవన్ మాజీ భార్యగా భావిస్తున్న రేణు దేశాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ అభిమానులకి మరో కొత్త అనుమానాన్ని కలిగించింది. రేణు దేశాయ్ ఇప్పుడు నిర్మాత గా మారి తొలిసారి గా మరాఠీ సినిమా తీస్తున్నారు. ఆ సందర్భం గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ పై ప్రశ్నల జల్లు కురిపించారు. గత పన్నెండు ఏళ్ళగా నేను పవన్ తో పాటు స్టొరీ డిస్కషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నింటిలో పాల్గొన్నాను. అందువల్ల సినిమా మేకింగ్ పైన ఒక అవగాహన ఏర్పడింది. అందుకు పవన్ కి థాంక్స్ చెప్తున్నాను అని ఆవిడ అన్నారు. పవన్ పైన ఇంత ప్రేమ ని చూపిస్తుంది కనుక వారిద్దరూ విడి పోలేదు ఏమో, పవన్ పై వచ్చిన వన్నీ రూమర్లే అని భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.