పవర్ 'స్టార్' సమస్యలు

సినిమా జీవితానికి సంబంధించినంత వరకూ దాదాపు మహేష్ బాబును దాటి దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం అశాంతిని, తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. సినీ వర్గాల కథనం ప్రకారం, ఆయన తన రెండో భార్య రేణూ దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చి మూడో అమ్మాయి మెడలో తాళి కట్టడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం విడిగా ఉంటున్న రేణూతో ఆయనకు కొద్దికాలంగా పడడం లేదనీ, ఆయన మరో యువతితో తిరుగుతున్నట్టు తెలిసి రేణూ ఆయనతో తరచూ గొడవపడుతున్నారనీ తెలిసింది. ఆమెను వివాహం చేసుకునేటప్పుడు కూడా ఆమె గర్భవతిగానే ఉన్నారు. అప్పట్లో రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశంలో ఉన్న పవన్ ప్రజల్లో తన పట్ల గౌరవం పెంచుకునేందుకు ఆమెనే పెళ్లి చేసుకున్నారని తెలిసింది. రేణూ ఇప్పుడు ముంబైలో డాక్యుమెంటరీ సినిమాలు తీస్తూ తన పుట్టింట్లో ఉంటున్నారు.

ఇంతకూ పవన్ ముచ్చటగా మూడోసారి ప్రేమిస్తున్న యువతీ పేరు డోన్నా. ఆమె ఆస్ట్రేలియాకు చెందినా యువతీ. ఒక సినిమాలో ఆమె పవన్ తో ఐటెం సాంగ్ చేసారు. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్యా సంబంధం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి న్యాయస్థానానికి అప్పీలు కూడా చేసుకున్నట్టు తెలిసింది. కొద్ది కాలంగా పవన్, డోన్నాలు సహజీవనం చేస్తున్నట్టు కూడా తెలిసింది.

Send a Comment

Your email address will not be published.