వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో సాధించిన విజయాన్ని సందీప్ కిషన్ తన రెండో చిత్రమైన రా రా కృష్ణయ్య లో ఏమాత్రం పొందలేకపోయాడు. ఈమధ్యే విడుదలైన ఈ చిత్రంలో అతనికి జోడీగా రెజీనా కసాన్డ్రా నటించింది. తొలి భాగంలో రేజీనా, మలి భాగంలో జగపతి బాబు తమతమ నటనలతో ప్రేక్షకులకు కాస్తంత వినోదం పంచారు. దర్శకుడు మహేష్ బాబు తన ప్రతిభను సరిగ్గా చూపించలేకపోయారు. తేరే నాల్ లవ్ హో గయా అనే హిందీ సినిమా మూలంగా చేసుకని తెలుగులో తీసిన సినిమా ఇది. కానీ ఈ చిత్రం విఫలమైంది.
టాలీవుడ్ లో ఐడియాలు కరువయ్యాయన్నట్లు కొందరు నిర్మాతలు పర భాషా చిత్రాల హక్కులు కొనుగోలు చేసి వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చెయ్యడం జరుగుతున్నాయి. అయితే ఆక్రమంలో కొన్ని మాత్రమే కొద్ది మేరకు బాగుంటున్నాయి. ఈ క్రమలో వచ్చిన రా రా కృష్ణయ్య సినిమాను రీమేక్ గా చెప్పలేం కానీ ఫ్రీ మేక్ గా అనుకోవచ్చు. సందీప్ కిషన్ నటన దారుణంగా ఉంది. ఈ చిత్ర కథానాయకుడు తనికెళ్ళ భరణి దగ్గర పనిచేస్తాడు. అయితే యజమాని మోసం చెయ్యడంతో అతని కూతురిని కథానాయకుడు కిడ్నాప్ చేస్తాడు. కథ సాగే క్రమంలో ఆ తర్వాత జగపతి బాబు ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఇంతకూ జగ్గు భాయి ఎవరు? అతనెందుకు కిడ్నాప్ చేస్తాడు అనేది కథ. తాగుబోతు రమేష్ కొన్ని చోట్ల నవ్విస్తాడు. రేజీనా నటన బాగుంది. రీమేక్ చెయ్యడంలో దర్శకుడు విఫలమవడం విచారకరం.