పిల్లా నువ్వులేని జీవితం

సుదీర్ఘ నిరీక్షణే కావచ్చు కానీ సాయి ధరం తేజ్ కి అచ్చంగా సరిపోయిన చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’.

ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దికున్న చిత్రమే  ‘పిల్లా నువ్వులేని జీవితం’.

చిరంజీవి కుటుంబం నుంచి తెర ముందుకు వచ్చిన మరో నటుడు సాయి ధరం తేజ్.

సాయి ధరమ్ తేజ్,  రెజీన జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు పాత్ర కూడా కీలకమైనదే.

నిజానికి సాయి ధరం తేజ్ కి ఇది రెండో సినిమా. అతను నటించిన మొదటి సినిమా రేయ్ ఇంకా విడుదల కాలేదు.

ఇద్దరు రాజకీయ నాయకులతో కథ మొదలవుతుంది. సాయాజీ షిండే, ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రులు కావాలని ఆశపడుతుంటారు. అప్పుడు జర్నలిస్ట్ పాత్రలో నటించిన షఫీ సాయాజీ షిండే పై కొన్ని స్కాముల గురించి రాస్తాడు. ఆ సమయంలో కిరాయి హంతకుడు పాత్రలో నటించిన జగపతిబాబుని ఒక పోలీసు అధికారి సహకారాన్ని తీసుకుంటాడు. షఫీ ని హత్య చెయ్యమని పోలీసు అధికారి చెప్తాడు. ఈ క్రమంలో కాలేజీ విద్యార్ధి పాత్రలో నటించిన ధరం తేజ్ జగపతిబబుని కలిసి ఒకరిని చంపమని అడుగుతాడు. అందుకు జగపతి బాబు ఒప్పుకోడు. అప్పుడు సాయి ధరం తేజ్ అతని గురించి చెప్తాడు. మరోవైపు సాయి ధరం తేజ్ రేజీనా తో ప్రేమలో పడతాడు. కానీ అతని ప్రేమను ఆమె తిరస్కరిస్తుంది. అయితే కొన్ని మలుపులు ఈ కథనంలో చోటుచేసుకుంటాయి. వాటిని తెరపై చూడవలసిందే.

మెగా అభిమానులకు ఇది మంచి కానుకగా చెప్పుకోవచ్చు. సాయి ధరం తేజ్ నటన చాలా బాగుంది. అతను ఎంతో నమ్మకంతో చేసిన సినిమా ఇది. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వారు అటు చిరు లేదా ఇటు పవన్ కళ్యాన్ ని కానీ ఎవరినో ఒకరిని  నటనలో అనుకరించడం మామూలే. కానీ సాయి ధరం తేజ్ ఎక్కడా ఆ చాయలకు పూకుండా తన సహజ ధోరణిలో నటించడం మెచ్చుకోదగ్గది. మరోవైపు రేజీనా అందంగా కనిపించింది. ఆమె తన పాత్రకు తగిన న్యాయం చేసిందని చెప్పడానికి ఆలోచించక్కరలేదు.

అనూప్ రూబెన్స్ సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.

డైమండ్ రత్నం మాటలు రాసారు.

కొన్ని లోటుపాట్లు అక్కడక్కడా ఉన్నప్పటికీ ఇది చూడదగ్గ చిత్రమే. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి కి దక్కుతుంది. ఏ ఎస్ రవికుమార్ చౌదరి చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం ఇది.

ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటి యువతని బాగానే  ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్న చిత్రమే  ‘పిల్లా నువ్వులేని జీవితం’

Send a Comment

Your email address will not be published.