పూర్తి విశ్రాంతిలో విద్యా బాలన్

నటి విద్యా బాలన్ పూర్తి విశ్రాంతిలో ఉండి. ఆమె ఇటీవల తన భర్తతో కలిసి దుబాయికి వెళ్తుండగా ఉన్నట్టుండి విద్యాబాలన్ కి కడుపులో నొప్పి మొదలయ్యింది. అప్పుడు ఆమెకు వైద్యులు పరీక్షలు చేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టు తేల్చారు. అంతేకాదు ఆమె తీవ్ర జ్వరంతో బాధ పడింది. దానితో విద్యా బాలన్ భర్తతో కలిసి వెంటనే ముంబై కి చేరుకుంది. ఆమెను పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు.

ఆమె ముంబై చేరుకోగానే మళ్ళీ పరీక్షించగా అంతా సవ్యంగానే ఉన్నట్టు డాక్టర్స్ చెప్పడంతో విద్యా బాలన్ అమ్మయ్య అనుకుంది. ఆమె మాట్లాడుతూ, రాళ్ళు యూరిన్ లో పోయాయని, తానిప్పుడు హాయిగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. అయితే కొన్ని కారణాల వల్ల వృత్తిపరంగా కొన్ని పనులను వాయిదా వేసుకున్నట్టు తెలిపింది.

విద్యా బాలన్ కి పెళ్ళయి కొన్నేళ్ళు అయ్యింది. త్వరలో ఓ బిడ్డలు తల్లి అవుతారా అడగ్గా ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనూ తానేమీ ముందస్తు ప్రణాలికలు వేసుకోనని ఆమె జవాబిచ్చారు.

అయితే ఆమె ోగర్భవతిగా ఉన్నట్టు కొన్ని వదంతులు వచ్చాయి. వాటి గురించి అడగ్గా ….అలాంటివేవైనా ఉంటే తాను చెప్తానని, ఇందులో దాచడానికి ఏదీ లేదని విద్యాబాలన్ జవాబిచ్చింది.

Send a Comment

Your email address will not be published.