పెద్ద హీరోలతో సినిమా తీయడం నాకు రాదు

పెద్ద హీరోలకి ఇమేజ్ ఉంటుంది . వారికి బోలెడంత మంది ఫాన్సు కూడా ఉంటారు . వారి అందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలి. అలా ఒక పరిధి లోకి చిక్కుకు పోవడం నాకు రాదు. అందుకే నాకు స్టార్ హీరో లతో సినిమాలు తీయడం రాదు అంటున్నాడు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ.
నాగార్జున , వెంకటేష్ లతో శివ , క్షణక్షణం తీసినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. నేను ఎప్పుడు పెద్ద హీరో లతో సినిమాలు తీయను . వారితో తీయడం నాకు చేతకాదు . అందుకే నేను ఎప్పుడూ కధా వస్తువు పైనే ఆధార పడతాను అని సత్య- 2 ప్రచారం సందర్భం గా వర్మ అన్నారు.

సత్య సినిమా తీసిన రోజులకీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు అందుబాటులో లేదు. అప్పుడు ఎవరన్నా ఏదన్నా పని చేస్తే అది ఎవరు చేసారో, ఎందుకు చేసారో తెలిసి పోయేది . అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు . కేవలం ఇంటర్నెట్ ద్వారానే మొత్తం పనులు జరిగి పోతున్నాయి. కనీసం మనుషుల ముఖాముఖీ పరిచయాలు కూడా ఉండటం లేదు. చంపాలి అనుకునే వాడికి అవతలి వ్యక్తి తెలిస్తే చాలు. పని జరిగి పోతుంది. ఆ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొనే సత్య 2 తీశాను.

నా దృష్టికి ఎక్కువగా సాధారణ జీవితం గడిపే వారు రారు . ఉదాహరణకి ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడితే నూటికి 99 శాతం ఆగి పోతారు. ఒక్క శాతం మంది మాత్రం సిగ్నల్ జంప్ చేసి వెళతారు. అలాంటి వారు నా దృష్టిని ఆకర్షిస్తారు . వారు ఎందుకు సిగ్నల్స్ జంప్ చేసారో తెలుసు కోవడం నాకిష్టం.
నాకు మాఫియా నుంచి ఆపద ఉందని ఒకసారి ఇంటలిజెన్స్ విభాగం హెచ్చరించింది . అయినా నాకు ఏమీ కాలేదు. ఇంటలిజెన్స్ కంటే నాకే ఎక్కువ తెలుసు .
పవన్ కళ్యాణ్ ని చూస్తే ప్రజలకి సేవ చేయాలనే తపన కనిపిస్తోంది. అందుకే ఆయన్ని సినిమాల్లోకి రమ్మంటున్నా. నాకు ప్రజలకి సేవ చేసే లక్షణం లేదు. అందుకే రాను . అంతే కాదు సినిమాల్లో కూడా నటించను. ఎందుకంటే నాకు నటన రాదు.

Send a Comment

Your email address will not be published.