పెరిగిన గిరాకీ

పెళ్లిచూపులు చిత్రం విజయవంతం కావడంతో విజయ్ దేవరకొండకు గిరాకీ పెరిగింది. ఆ చిత్రంలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన విజయ్ రాత్రికి రాత్రి నలుగురి నోటా నానుతున్నాడు. పెళ్లిచూపులు చిత్రంతో అటు భారతీయ మార్కెట్ లోనే కాకుండా విదేశాలలోనూ అతనిప్పుడు కావాల్సిన నటుడయ్యాడు. బడా బడా సంస్థలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే విజయ్ చేతిలో భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్నాయని సన్నిహిత వర్గాల మాట. అలాగే మరో సినిమాలు అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయట.

అతని నటన చాలా సహజంగా ఉందని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ తదితర అగ్ర నిర్మాతలు చెప్పినట్టు విజయ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అశ్వినీదత్, యు వీ క్రియేషన్స్, సురేష్ బాబు, సాయి కొర్రపాటిలైతే ఇప్పటికే అడ్వాన్సు కూడా ఇచ్చి తమ చిత్రాలకు విజయ్ ని బుక్ చేయించుకున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ద్వారక, అర్జున్ రెడ్డి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.