పెళ్లిచీర

Samanthaప్రముఖ నటి సమంతా తన పెళ్లి చీరపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

వచ్చే అక్టోబర్ లో ఆమె పెళ్లి నాగచైతన్యతో జరగబోతోంది. ఈ పెళ్లి మూడు రోజులపాటు జరగబోతోంది. ఇందుకు ఏర్పాట్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. పెళ్లి గోవాలో జరుగుతుంది. ఈ పెళ్ళికోసం సమంతాకు తయారవుతున్న దుస్తులకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పెళ్లిలో ఆమె కట్టుకోబోయే చీరకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతోంది. సమంతాకు నిశ్చితార్థానికి కట్టుకున్న చీరను కె బజాజ్ తయారు చేసారు. ఈ చీరలోని అల్లికలు పెట్టింది పేరుగా అందరినీ ఆకట్టుకుంది. పెళ్లికేమో డీ రామానాయుడు భార్య డీ రాజేశ్వరిగారి చీర మీద సమంతా ద్రుష్టి సారించింది. ఈ చీరకు ఉన్న విలువ సామాన్యమైన విషయం కాదని ఆమె చెప్పింది. ఆ చీరపై అనుకోకుండా దృష్టి మళ్ళినట్టు చెప్పారు. పాత వాటిపై తనకేప్పుడో ఓ కన్ను ఉంటుందని, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది నిజమని నమ్ముతానని ఆమె చెప్పారు. వాటిని తాను విపరీతంగా ప్రేమిస్తానని అన్నారు. వాటి వెనుక ముడిపడి ఉన్న కథలు తనకెంతో ఇష్టమని అన్నారు. తన దగ్గర ఉన్న ఆభరణాలలో చాలా వరకు పాతవేనని చెప్పారు. అలాగే రాజేశ్వరి గారి పెళ్లి సమయంలో కట్టుకోబోవడం తలచుకుంటుంటే ఆనందంగా ఉందని అన్నారు సమంతా. ఈ చీరకు కె బజాజ్ మరింత కొత్తదనం తీసుకొచ్చారని అన్నారు.

Send a Comment

Your email address will not be published.