‘పెళ్లిచూపులు’ వినోదభరితమే

Pellichupulu_nఓ చక్కటి జ్ఞాపకంలాంటి చిత్రం…….పెళ్లిచూపులు.

విజయ్ దేవరకొండ, రితు వర్మ, నందు, అనీష్ కురువిల్లా, గురురాజ్ మానేపల్లి, ప్రియదర్శి తదితరులు
నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. తరుణ్ భాస్కర్ రచన చేసి దర్శకత్వం వంచారు. రాజ్ కందుకూరి, యాష్ రంగినేని నిర్మించిన ఈ చిత్ర కథలోకి వెళదాం….

ప్రశాంత్ గా నటించిన విజయ్ దేవరకొండ ఇంజినీరింగ్ పూర్తయిన రెండేళ్లకు సప్లిమెంటరీలు రాసి ఎంతో కష్టపడి పట్టా అందుకుంటాడు.

మరోవైపు చిత్ర క్యారక్టర్ లో నటించిన రితు వర్మ ఎంబీఏ పూర్తి చేసి తన కాళ్ల మీద తాను నిలబడాలని ఆరాట పడుతుంది.

సరైన లక్ష్యాలు లేని ప్రశాంత్ ఏ పనీ చేయకుండా కట్నం కోసమే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.

ఇంకోవైపు తండ్రి బలవంతం చేయడంతో తన ఆశయాన్ని కాదనుకుని బలవంతంగా పెళ్లిచూపులకు చిత్ర సిద్ధపడుతుంది.

ప్రశాంత్, చిత్ర పెళ్లిచూపుల్లో కలుసుకుంటారు. ఒకరినొకరు తెలుసుకుంటారు. మాట్లాడుకుంటారు. ఆ పెళ్లిచూపుల పరిచయాన్ని ప్రశాంత్, చిత్రలలో ఎలాంటి మలుపు తీసుకువచ్చింది అన్నదే కథ.

ఇదొకఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ. కథ కూడా హాయిగా సాగిపోతుంది. విసుగు పుట్టించని చక్కటి సన్నివేశాలు. అసహజంగా అనిపించవు. సంభాషణలు సొంపుగా ఉన్నాయి. హాస్యం సున్నితంగా అనిపించినా బాగుంది. సంగీతం కూడా వినసొంపే…చివర్లోనే ఇంకాస్త మాటలు ఉంటే బాగుండేది.

‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ కి పరిచయమైన విజయ్ దేవరకొండ ఈ ‘పెళ్లిచూపులు’ చిత్రంలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు నటనపరంగా. తన పాత్ర పేరుకి తగినట్లే విజయ్ ఎంతో ప్రశాంతంగా కనిపించాడు.

కథానాయిక రితు వర్మ కూడా చక్కగా నటించింది. ఆమె అభినయం బాగుంది. ఆమె బాడీ లాంగ్వేజ్.. కూడా చక్కగా ఉంది. ప్రశాంత్ మిత్రురాలి పాత్రలో నటించిన ప్రియదర్శి తెలంగాణ యాసలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నందు., అనీష్ కురువిల్లా తదితరులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

వివేక్ సాగర్ సంగీతం ఓ పండగే. దర్శకుడు తరుణ్ భాస్కర్ అందరినీ కూడగట్టుకుని మంచి చిత్రాన్ని అందించాడు అని చెప్పుకోక తప్పదు.
మొత్తమ్మీద ఈ పెళ్లిచూపులు మంచి చిత్రమే…చూడదగ్గ చూపులే…పెళ్లిచూపులు.

Send a Comment

Your email address will not be published.