పెళ్లి కూతురైన నిషా అగర్వాల్

సోలో సినిమాలో నారా రోహిత్ సరసన హీరోయిన్ గా నటించిన నిషా అగర్వాల్ గుర్తుందా? ఆమె నండీ కాజోల్ అగర్వాల్ చెల్లెలు. మగధీర హీరోయిన్ కాజోల్ చెల్లెలుగా ఇండస్ట్రీ కి పరిచయమైనా తన దంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది నిషా.

ఏమైంది ఈ వేళ సినిమా తో తెలుగు రంగానికి పరిచయమైన నిషా ఆ తర్వాత సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయి తో వంటి సినిమాల్లో నటించి మినిమం గ్యారంటీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. అక్క కాజోల్ బాలీ వుడ్ కి వెళ్ళినా తాను మాత్రం తెలుగు ఇండస్ట్రీ లోనే ఉండి పోయింది. అయితే ఇప్పుడు నిషా ప్రేమ లో పడిందట. సినిమా రంగానికి చెందని వ్యక్తి తో ప్రేమలో పడ్డాను. ఆ వివరాలు ఏవీ ఇప్పుడే అడక్కండి అని మీడియా తో నాలుగు , ఐదు నెలల క్రితం చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా పెళ్లి కబురే చెప్పింది. ముంబై కి చెందిన వ్యాపార వేత్త కరణ్ ఉల్లేసా తో నిషా ప్రేమ వ్యవహారాన్ని ఇరువైపుల పెద్దలు అంగీకరించారు. ఇటీవలే ముంబై లో వారికి నిశ్చితార్ధం కూడా జరిగింది. డిసెంబర్ 28 న ముంబై లో పెళ్లి. సినిమాల్లోకి అక్క కంటే లేట్ గా వచ్చిన ఈ భామ పెళ్లి పీటలు మాత్రం అక్క కంటే ముందే ఎక్కడం విశేషం.

Send a Comment

Your email address will not be published.