కత్తి మహేష్ దర్శకత్వం లో నందు, నికితా నారాయణ్ జంటగా నటిస్తున్న ” పెసరట్టు” సినిమా హైదరాబాద్ లోని గండిపేటలో ప్రారంభం అయింది.
క్లాప్ బోర్డ్ స్టుడియో, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్, రిచెజ్జ మీడియా ఎంటర్ టైన్మెంట్స్, పింక్ పాక్డ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమే పెసరట్టు.
పెసరట్టు ప్రారంభం రోజున ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శక నిర్మాత స్టీవన్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ లో తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ ఫ్లో-కాం టెక్నాలజీని ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో, హీరోయిన్ తప్ప మిగిలిన నటులను సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఎన్నుకుని వారం రోజుల్లో వారికి వర్క్ షాప్ నిర్వహించారు.
సింగిల్ షెడ్యూల్ లో పెసరట్టును పూర్తి చేసి వచ్చే అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు శ్రీనివాస్ గునిసెట్టి, ఈడుపుగంటి శేషగిరి రావు, డీజీ సుకుమర్ ఆలోచిస్తున్నారు. .
ఈ చిత్రానికి సంగీతం ఘంటశాల విశ్వనాథ్ సమకూరుస్తున్నారు. అరిపాల సత్య ప్రసాద్ మాటలు రాయగా సుభాష్ పాటలు రాసారు.