పేరుప్రతిష్ఠల కోసం కాదు...

ప్రముఖ బాలీవుడ్ స్టార్ అనుష్కా శర్మ తాను ధరించిన రెజ్లర్ పాత్ర గురించి స్పందించారు. సుల్తాన్ అనే చిత్రంలో ఆమె ఈ రెజ్లర్ పాత్ర పోషించారు. ఈ పాత్రతో తానేదో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని తాపత్రయ పడలేదని అనుష్కా చెప్పారు.

రెజ్లర్ పాత్ర కోసం ఆమె డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అది నిజమే అంటూ తాను ప్రోటీన్ డైట్ తీసుకున్నానని ఆమె తెలిపారు.

దాదాపు రెండేళ్ల నుంచి ఆమె పక్కా శాకాహారిగా ఉన్నారు. ఈ కాలంలో ఆమె ఎక్కువగా గ్రీన్ వెజిటెబుల్స్ పైనే ఆధారపడ్డారు.

షారూక్ ఖాన్ సరసన రబ్ నే బనా ది జోడీ అనే సినిమాతో ఎనిమిదేళ్ల క్రితం రంగప్రవేశం చేసిన అనుష్కా దర్శకుడు ఆదిత్య చోప్రా తన మీద నమ్మకం ఉంచుకుని ఆ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పకతప్పదని అన్నారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ లోచేసేటప్పుడల్లా వాళ్ళు తనపై పెట్టున్న నమ్మకం కనిపించేది, అందుకే ఇంత కాలం సినీ రంగంలో కొనసాగుతున్నానని ఆమె చెప్పారు. దేవుడి దయతో ఇప్పటి వరకూ అంతా సవ్యంగానే సాగుతూ వస్తోందని చెప్తూ తాను ఓ సామాన్య మైన కుటుంబం నుంచే వచ్చానని, తన యాక్టింగ్ కెరీర్ ని గౌరవంగానే చూస్తానని అన్నారు.

మహిళలు విభిన్న రంగాలలో రాణిస్తున్నారని, మహిళలు కథలు సమకూర్చిన చిత్రాలు కూడా బాగా రాణించాయని ఆమె అన్నారు.

కొందరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా కొందరిలో నెగటివ్ ధోరణి కనిపిస్తోందని, అందుకు తాను విచారిస్తున్నానని ఆమె చెప్పారు.

Send a Comment

Your email address will not be published.