పొరపాట్లు జరక్కుండా ... రామ్

మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటించేందుకు హీరో రామ్ సమ్మతించారు.

రామ్ ఇప్పుడు ప్రతీ అడుగు ఆచి తూచి వేస్తున్నారు. రామ్ నటించిన ఎందుకంటే  ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాల చిత్రాలు ఫెయిల్ కావడంతో అతను ఇప్పుడు  బాగా ఆలోచించి గానీ చిత్రాలు ఒప్పుకోకూడదని అనుకున్నారని భోగట్టా. ఫెయిల్ అయిన గత చిత్రాలలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ అవకుండా చూసుకుంటున్నారు. కథాపరంగాను మంచి పాత్ర పోషించడానికే రామ్ ఇష్టపడుతున్నారు. మలినేని గోపీచంద్,  రామ్ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రానికి  పరుచూరి కిరీటి నిర్మాత.

వచ్చే ఉగాదికి షూటింగ్ మొదలవుతుందని నిర్మాత చెప్పారు.

ఈ చిత్రానికి పండగ చేస్కో అనే టైటిల్ పెట్టారని, ఈ సరదా టైటిల్ ఖరారు కావచ్చని తెలిసింది. రామ్ సరసన ప్రముఖ కథనాయికనే ఎన్నుకోవాలని ఆలోచిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.