ప్యార్ మే పడిపోయానే

శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం పై గతంలో ఏమైంది ఈ వేళ, అధినేత వంటి చిత్రాలను అందించిన కె కె రాధా మోహన్ ఇప్పుడు ప్యార్ మే పడిపోయానే  సినిమా తీస్తున్నారు.

రవి చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆది, శాన్వి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది.

మరి కొన్ని రోజుల్లోనే పాటల చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ కూడా ముగుస్తుంది.

మరోవైపు చిత్ర నిర్మాణ అనంతర పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో ఆది నటన గొప్పగా ఉందని నిర్మాత రాధా మోహన్ చెప్పారు.

ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాల తర్వాత ఈ చిత్రం మళ్ళీ తనకు మరో విజయాన్ని అందించగలదని హీరో ఆది బలంగా నమ్ముతున్నారు.

దర్శకుడు రవి చావాలి ప్రేమ కథను విభిన్న రీతిలో తెరకెక్కించారని ఆది చెప్పారు.

లవ్లీ తర్వాత తను శాన్వీ జోడీగా గొప్ప వినోదాత్మక చిత్రంతో  అభిమానుల ముందుకు వస్తున్నానని కూడా తెలిపారు.

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా వెన్నెల కిశోరే, కాసీ విశ్వనాథ్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, అనత్ తదితరులు నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.