ప్రతిఘటన

అప్పుడూ ఇప్పుడూ టైటిల్ ఒక్కటే , కానీ ….
———————————————–
అప్పుడు విజయశాంతి…ఇప్పుడు చార్మీ …ఏమిటనుకుంటున్నారా….కొన్ని సంవత్సరాల క్రితం విజయశాంతి నటించిన ఒక చిత్రం టైటిల్ ప్రతిఘటన ఎంతగా విజయవంతమైందో అందరికీ తెలిసిందే కదా…. అప్పుడు ఆ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై టీ కృష్ణ దర్శకత్వంలో ఆ చిత్రం తీసారు. ఇప్పుడు అదే టైటిల్ తో చార్మీ నటించిన చిత్రం విడుదలైంది. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో ఈ ప్రతిఘటన ప్రేక్షకుల ముందుంది. చార్మీ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలోని పాటలను ఆ మధ్య ఒక సామాన్య మహిళా చేతుల మీదుగా విడుదల చేసారు.
ఈ చిత్రం గొప్ప సందేశాత్మక చిత్రమని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. ప్రతిఘటన చిత్రంతో నాడు విజయశాంతికి ఎంతో పేరు వచ్చిందని, ఇప్పుడు చార్మీకి కూడా అంతే పేరు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అప్పుడూ ఇప్పుడూ టైటిల్ ఒక్కటే కానీ ఆ చిత్రానికి ఈ చిత్రం ఎంత రీమేక్ కానే కాదని ఆయన అన్నారు.
చూడాలి మరి అభిమానులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో…?

Send a Comment

Your email address will not be published.