ప్రభాస్ చిత్రంలో శ్రద్ధా కపూర్!

“బాహుబలి” ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ సాహో చిత్రంలో ప్రముఖ నాయకి వేట దాదాపుగా తుది దశకు చేరుకుంది. ఎవరెవరినో అనుకుని చివరకు బాలీవుడ్ తార శ్రద్ధా కపూర్ కి సాహో చిత్రంలో ప్రధాన పాత్ర ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి ఆమె అంగీకరించినట్టు భోగట్టా. ఆమె అందుబాటులో ఉంది. నటించబోయే తేదీలు కూడా అనుకూలంగా ఉన్నట్టు తెలియవచ్చింది. కనుక అన్నీ అనుకున్నట్టే సాగితే ఆమె ఈ చిత్రం ముఖ్య పాత్రలో నటించడం ఖాయం.

చిత్ర యూనిట్ ఆమెను కలిసి ఇప్పటికే మాట్లాడారు. అందుకు ఆమె ఒప్పుకున్నట్టు తెలిసింది. అయితే ఆమె ఇంకా సంతకాలు చేయాల్సి ఉంది. అలాగే మిగిలిన మరి కొన్ని ఫార్మలిటీలపై కూడా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.

Send a Comment

Your email address will not be published.