“బాహుబలి” సినిమాతో చలనచిత్ర జగత్తులో సంచలనం సృష్టించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఊహించలేనంత ఎత్తుకి ఎదిగాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించి తొలిసారిగా ఓ దక్షిణాది సెలబ్రిటీగా టుస్సాడ్స్ లో అతని మైనపు బొమ్మ ఏర్పాటు కాబోతోంది.
సమాజంలోని వివిధ రంగాలలో సుప్రసిద్ధులయిన వారి రూపాలకు నకలుగా మైనపు బొమ్మలను తయారు చేయడంలో టుస్సాడ్స్ ఘనత అందరికీ తెలిసిందే కదా!
బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ లో ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు కాబోతోంది.
ఈ విషయాన్ని టుస్సాడ్స్ మ్యూజియం చీఫ్ నొప్పడాన్ ప్రపీమ్ పంట్ వెల్లడించారు.
ఆయన ఇప్పటికే హైద్రాబాద్ వచ్చి ఇదే విషయాన్ని నటుడు ప్రభాస్ తో చెప్పి ఆయన ఫోటోలను తీసుకున్నారు.
ఈ విగ్రహం రూపొందించడానికి టుస్సాడ్స్ వర్గాలు కనీసం 350 ఫోటోలను తీసుకుంటాయి.
ఇదే టుస్సాడ్స్ మ్యూజియంలో ఇటీవల మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ మైనపు బొమ్మను కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభాస్ కు ఈ ఘనత దక్కుతోంది.