ప్రారంభమైన జల్సారాయుడు

సి హెచ్ సుదీర్ రాజ్ దర్శకత్వంలో వెంకటరమణ మూవీస్ పతాకంపై జల్సారాయుడు సినిమా ప్రారంభోత్సవం హైదరాబాదులోని రామానాయుడు స్టుడియోలో ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభమైంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్తేర్ జంటగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. కొండేటి సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

సిద్దాంతి రాజు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ కుటుంబంలో చోటు చేసుకునే భావోద్వేగాలపై చర్చించే చిత్రమిది అని అన్నారు. టైటిల్ కు తగినట్టే తన పాత్ర ఉంటుందని, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఉందని శ్రీకాంత్ చెప్పారు.

దర్శకుడు సుదీర్ రాజ్ మాట్లాడుతూ తాను కథ చెప్పగానే ఈ చిత్రంలో నటించడానికి శ్రీకాంత్ ఒప్పుకున్నారని, ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా వచ్చి చూసేలా తీస్తామని అన్నారు.

శ్రీకాంత్ తో కలిసి నటించే అవకాశం రావడం తనకెంతో ఆనందంగా ఉందని నాయిక ఎస్తేర్ చెప్పారు.

చక్రి స్వరాలు సమకూరస్తున్నారు.

ఈ చిత్రానికి ఇప్పటికే ఇద్దరు నాయికలు ఎంపికయ్యారు. మరో నాయికను ఎంపిక చేయవలసి ఉంది.

వచ్చే డిసెంబర్ 6వ తేదీన జల్సారాయుడు విడుదల చెయ్యాలన్నది నిర్మాత కోలన వెంకటేష్ అంచనా.

ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, పృధ్వీ, ప్రాచి సిన్హా తదితరులు నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.