ప్రిన్స్ మహేష్ భయ పడ్డాడు

ప్రిన్స్ ….. ఆరడుగుల ఆజానుబాహుడు. ఆడ పిల్లల కలల రాకుమారుడు. శత్రువులు గుంపులుగా వచ్చినా, మాఫియా గ్యాంగ్ తో వచ్చినా మట్టు పెట్టటానికి ఆ “ఒక్కడు” చాలు. అయితే, ఇంత పెద్ద హీరో కూడా ఒకరంటే బాగా భయ పడ్డాడు. ఆ భయం తట్టుకోలేక ఎవరికీ చెప్పా పెట్టకుండా పారి పోయాడు. ప్రిన్స్ మహేష్ ని అంతగా భయ పెట్టింది ఎవరో కాదు స్వయానా వాళ్ళ అమ్మమ్మ దుర్గమ్మ.

మహేష్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ దుర్గమ్మ వద్దే పెరిగాడు. తనని ఎంతో ప్రేమ గా పెంచిన ఆమె అంటే, మహేష్ కి ప్రాణం. మహేష్ సినిమాల్లోకి రావడం వెనుక, అతని సక్సెస్ వెనుక దుర్గమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అంతే కాదు సినిమాలకి సంబంధించిన వ్యవహారాలతో పాటు, ఆదాయ పన్నులు కట్టటం వంటి పనుల్ని కూడా ఆమె స్వయంగా చూసుకొనే వారు. అయితే, బాలీ వుడ్ నటి నమ్రత శిరోద్కర్ తో మహేష్ ప్రేమ వ్యహారం మాత్రం దుర్గమ్మ ఒప్పుకోలేదు. మహేష్, ఆమెని పెళ్లి చేసుకోడానికి వీల్లేదని హుకుం జారీ చేసారు. దాంతో మహేష్ పరిస్థితి తెలుగు సినిమా హీరో లా అయింది. ప్రేమని పంచిన అమ్మమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక పోయినా, తర్వాత ఆశీర్వ దిస్తుందనే నమ్మకంతో ఎవరికీ చెప్పకుండా కేవలం అతికొద్ది మంది సమక్షం లో నమ్రత ని ముంబై లో వివాహం చేసుకొన్నాడట. ఈ విషయాన్ని మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చెప్పాడు. ఆ తర్వాత ఆమె మహేష్ ని మనస్పూర్తి గా ఆశీర్వ దించింది. మహేష్ బాబు నటించిన సినిమాల వంద రోజుల వేడుకలకి కూడా ఆమె హాజరయ్యారు. కొద్ది కాలం క్రితం దుర్గమ్మ మరణించారని కృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

Send a Comment

Your email address will not be published.