ప్రిన్స్ ‘స్పైడర్’

మురుగదాస్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘స్పైడర్’ . ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు
నిర్మించిన చిత్రం ఇది.

ఈ చిత్రంలో ఇంకా ఎస్.జె.సూర్య, భరత్, ప్రియదర్శి, షాయాజి షిండే తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంగీతం హారిస్ జైరాజ్.

కథలోకి వెళ్తే….
Spiderశివ పాత్రలో నటించిన మహేష్ బాబు ఓ ఇంటలిజెన్స్ బ్యూరోలో ఫోన్ డేటా సర్వేలెన్స్ నిపుణుడు. తన అర్హతకు ఇంకా మంచి ఉద్యోగమే వచ్చే అవకాశమున్నా, అలాగే డబ్బు సంపాదించే అవకాశమున్నా అతను ఈ ఉద్యోగాన్నేకోరుకుంటాడు. ఈ ఉద్యోగం ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సంతృప్తి పడుతుంటాడు. అందుకే ఈ ఉద్యోగంలో కొనసాగడానికే ఇష్టపడతాడు. ఇలా ఉండగా, అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ అతని జీవితంలో కొత్త మలుపు తిప్పుతుంది. అతిదారుణంగా హత్యలు చేస్తున్న భైరవుడు అనే సైకో కిల్లర్ గురించి తెలుసుకుంటాడు. ఈ పాత్రలో ఎస్.జె.సూర్య నటించాడు. అతని విషయాన్ని తెలుసుకని బయటకు లాగుతాడు శివ. సైకో సోదరుడు హత్యకు గురవుతాడు. దీంతో సైకో శివను లక్ష్యంగా చేసుకుని బీకరంగా తయారవుతాడు. అయితే అతనిని శివ ఏ విధంగా అడ్డుకున్నాడు అనేదే కథ. అది తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాలి.

హీరో ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని కథనంతా నడిపించడం గమనార్హం. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య కూడా బాగా నటించాడు. అందుకు తగినట్లే కథను రూపొందించారు. హీరో, విలన్ మధ్య ఎత్తుకుపైఎత్తులు ఓమోస్తరుగా నడిచాయి. ఆహా అని అనుకోవడానికి వీల్లేదు.

కానీ విలన్ పాత్రను ప్రవేశపెట్టినప్పటి నుంచీ చివరి వరకూ అతను తర్వాత ఏం చేస్తాడో అని అనిపించేలా కథ సాగడం విశేషం.

ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం బాగుంది.
ఎప్పట్లాగే మహేష్ బాబు వంద శాతం తన ప్రతిభను కనబరిచాడు. అతని నటనలో ఎక్కడా తప్పు పట్టడానికి వీల్లేదు. సింప్లీ సూపర్బ్ అని చెప్పుకోక తప్పదు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ విషయానికి వస్తే ఆమె కాస్త నిరుత్సాహ పరచింది. విలన్ గా ఎస్.జె.సూర్య చాలా బాగా నటించాడు. సైకో లక్షణాలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించాడు.

హారిస్ జైరాజ్ సంగీతం ఆహా ఓహో అని లేదు. పాటలు చాలా పేలవంగా ఉన్నాయి. కానీ హారిస్ నేపథ్య సంగీతం బాగుంది. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. దర్శకుడు మురుగదాస్ తన మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు తగు రీతిలో న్యాయం చేయలేకపోయాడు. కొన్ని చోట్ల సన్నివేశాలు బోర్ కొట్టాయి. .
ఓమారు చూడొచ్చు.

Send a Comment

Your email address will not be published.