ప్రేక్షకులు ముందుకు రేసుగుర్రం

ఉడికించే ఎండలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది రేసుగుర్రం. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రమంతటా అభిమానుల సందడితో అల్లు అర్జున్, శ్రుతిహాసన్ వచ్చేసారు. ప్రేక్షకులకు ఈ చిత్రం బొనంజాగా అందించినట్లు దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు.
నల్లమలుపు శ్రీనివాస్, డా. కె. వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రమే రేసుగుర్రం.
చక్కటి వినోదంతో వేసవి తాపాన్ని తీర్చేవిధంగా రేసుగుర్రం చిత్రం ఉంటుందన్నది ఈ చిత్ర యూనిట్ అభిప్రాయం. యాక్షన్ కు ఏ మాత్రం లోటుండదు. అలాగే సకుటుంబంగా చూడ దగ్గ చిత్రం కూడాను.
చదువు పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళాలనుకున్న ఓ కుర్రాడి కథ ఇది. అయితే అతనికి ప్రత్యేకించి ఒక లక్ష్యం అంటూ ఉండదు. కానీ తాను ఏదైతే అనుకుంటాడో అది నెరవేరే వరకు వదిలిపెట్టాడు. రేసులో పాల్గొన్న గుర్రం పక్కకు చూడకుండా ఏ విధంగా అయితే తన లక్ష్యాన్ని చేదించేందుకు దృష్టి సారిస్తుందో అలాగే ఈ చిత్రంలో హీరో కూడా తాను అనుకున్న దానిపై గురి పెడతాడు. అందుకోసమే రేసు గుర్రాన్ని పోలుస్తూ ఈ చిత్రానికి టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో హీరో ఒక హార్స్ రైడర్ కాదు. ఈ చిత్రంలోని మలుపులను వెండితెరపై చూసి తీరాల్సిందే. అన్నదమ్ములుగా శ్యాం, అల్లు అర్జున్ నటించారు. అల్లు అర్జున్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకునే ఈ కథను రూపొందించారు.
భోజ్ పూరి నటుడు రవి కిషన్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు.
సంగీతం : తమన్. చాయాగ్రహణం : మనోజ్.

Send a Comment

Your email address will not be published.