ప్రేమంటే నమ్మకం "కుమారి 21 ఎఫ్"

టాలీవుడ్ కి దర్శకుడిగా ప‌రిచ‌య‌మైన సుకుమార్ ఇప్పుడు తాజాగా కుమారి 21 ఎఫ్ చిత్రంతో తనకో ఇమేజ్ ని సంపాదించాడు.

కుమారి 21 ఎఫ్ చిత్ర నిర్మాతగా మారిన సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే కూడా అందించి ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాడు. ప్రేమ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సుకుమార్ కుమారి 21 ఎఫ్ అనే ప్రేమ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్‌కు ఇవ్వడం విశేషం.

దేవిశ్రీప్ర‌సాద్‌ స్వరపరచిన ఈ చిత్ర కథలోకి వెళ్తే…

హైద‌రాబాద్‌లో అదొక కాలనీ. ఆ కాలనీలో సిద్ధూ పాత్రలో నటించిన రాజ్ త‌రుణ్‌ తన తల్లితో నివాసం ఉంటాడు. అతనికి తల్లిగా హేమ నటించారు. రాజ్ తరుణ్ కి ముగ్గురు సన్నిహిత మిత్రులు ఉంటారు. మిత్రులలో ఒకడు శంక‌ర్. శంకర్ పాత్రలో నోయెల్‌ నటించాడు. ఈ నోయెల్ మిత్రులతో కలిసి ఏటీఎంలలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. నోయెల్ బృందానికి రాజ్ తరుణ్ తన వంతు సహాయం చేస్తూ వస్తాడు.

అయితే అనుకోకుండా ఒక రోజు కథానాయిక కుమారితో రాజ్ తరుణ్ కి పరిచయం ఏర్పడుతుంది. కుమారి పాత్రలో హేబా ప‌టేల్‌ నటించింది.

కుమారి కి ధైర్యమే సొత్తు. ఆమె తానూ మనసుకు ఏది తోస్తే అది దాచుకోకుండా బయటకు చెప్పేస్తుంది. . కుమారితో రాజ్ తరుణ్ ప్రేమలో పడతాడు. ఇక్కడ నోయెల్ మిత్ర బృందం రాజ్ తరుణ్ తో కుమారి మంచి అమ్మాయి కాదని చెప్తారు. ఆమెతో ప్రేమా దోమా వద్దని అంటారు. దీనితో రాజ్ తరుణ్ ఆమె క్యారెక్ట‌ర్‌ ని అనుమానిస్తాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ కి కొన్ని విషయాలు తెలిసొస్తాయి. అయితే ఆ విషయాలు ఎనితి? వాటిలోని నిజానిజాలు ఎంత? అందులో నిజాలేంటి? నోయెల్ బృందం చేసే పనులు ఏమిటి? తదితర విషయాలు తెలుసుకోవడం కోసం కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని వెండితెర మీద చూడాలి.

నిర్మాతగా సుకుమార్ ఆసక్తికరమైన కథనే అందించాడు. అసలు ప్రేమించాలంటే ఉండాల్సింది ప్రేమ మీద ఓ అవగాహన అని ఈ చిత్రంతో చెప్పిన సుకుమార్ కథను నడిపించిన తీరు బాగుంది.

రాజ్ త‌రుణ్‌, హేబా ప‌టేల్ తమ పాత్ర‌ల‌కు తగిన న్యాయం చేశారు. కతాయికను గ్లామరస్ గా చూపడంలో దర్శకుడు క్లిక్కయ్యాడు.

పాటలు వినసొంపుగానే ఉన్నాయి.

మొత్తంమీద పరవాలేదు. చూడవచ్చు కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని.

Send a Comment

Your email address will not be published.