ప్రేమకథతో నవీన్ చంద్ర

తన చివరి రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో మంచి అవకాశం కోసం ఎదురు చూసిన నవీన్ చంద్ర ఇప్పుడు ఓ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చిత్రం పేరు చందమామ రావే.

చందమామ రావే ఆసక్తికరమైన ప్రేమ కథ. దీనిని కవల సోదరులు ధర్మ, రక్ష దర్శకత్వం వహించారు. ఈ దర్శక సోదరులకు తనతో కలిసి చిత్రం చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారని నవీన్ చంద్ర అన్నారు.
అంతకుముందు వీళ్ళిద్దరూ ఎందరో దర్శకుల దగ్గర వర్క్ చేసారని, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర చిత్రానికి రచయితగా చేసారని అన్నారు. అయితే ఇద్దరూ స్పష్టంగా ఉండి ఒకే విధమైన ఆలోచనలు పంచుకుని కలిసిరావడం అద్భుతమని అన్నారు.

జీవితానికి సంబంధించి మూడు దశలను ఈ చిత్రంలో గొప్పగా చిత్రించడం జరిగినట్టు నవీన్ చంద్ర తెలిపారు.

అయితే ఈ చిత్రాన్ని మలయాళంలో వచ్చిన ప్రేమం చిత్రంతో పోల్చడానికి వీల్లేదని అన్నారు.

రెండూ భిన్నమైనవని, ప్రేమం చిత్రం ఓ ప్రముఖ యాక్టర్ గురించి తీసినదని, అయితే తన చిత్రం ఓ ప్రముఖ జంటపై కేంద్రీకరించిన చిత్రమని వివరించారు.

ఇలా ఉండగా గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగర్త పడ్డానని, అందుకే మంచి స్క్రిప్ట్ కోసం దీర్ఘ కాలం ఆగానని నవీన్ చంద్ర చెప్పారు.

ఈ చిత్రం షూటింగ్ మే 10వ తేదీన పూర్తి అయ్యిందని , మొదట్లో గ్యాంగ్ టక్ లో – అయిదు డిగ్రీల సెల్సియస్ లోను,. ఆ తర్వాత గోవాలో వేడిమిలోను, అటు తర్వాత హైదరాబాదులో అంతకన్నా వేడిమిలో షూటింగ్ సాగినట్టు ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.