ప్రేము దాటలేము అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు.
అభిమానం నలిగి కన్నీరు కార్చేది కూడా ప్రేమే కదా అని ఆయన అన్నారు. ప్రేమ అనగానే వెంటనే దానిని సెక్స్ తో ముడిపెట్టి చూస్తున్నారు…అది సరి కాదనే రీతిలో మాట్లాడుతూ తనకు, కె బాలచందర్ కి, తనకు హాస్యనటుడు నాగేష్ కి, తనకు ఇళయరాజాకు మధ్య కూడా ఉన్నది ప్రేమే అని ఆయన చెప్పారు. తనకు గౌతమికీ మధ్య ఉన్నది కూడా ప్రేమే అని చెప్పిన కమల్ ప్రేమించడమే సుఖమైనది అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రేమించబడటం కాస్సేపే గొప్పగా ఉంటుందన్నారు.
కుమార్తె శృతి హాసన్ తో ఒక సినిమా చేస్తున్నట్టు చెప్తూ ఈ చిత్రం తాలూకు సన్నివేశాలు అమెరికాలో వచ్చే ఏప్రిల్ లో మొదలు పెడతామన్నారు. ఈమధ్య శృతి హాసన్ కు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా కోసం అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేదని, ఇచ్చినట్లయితే తనకు మహా కోపం వచ్చేదని చెప్పారు. శృతి జాసన్ కి వాచ్ అన్నా చీర అన్నా చాలా ఇష్టమని, అందుకే అవే పుట్టినరోజు కానుకగా ఇచ్చానని కమల్ తెలిపారు.