ప్రేమ కథే "కేరింత"

సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్య, పార్వతీశం, విశ్వంత్‌ తదితరులు నటించిన కేరింత విడుదల అయ్యింది. అడివి సాయి కిరణ్ దర్శకత్వం వహించడంతోపాటు కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. మిక్కీ జె మేయర్‌ స్వరపరిచారు.  ఈ చిత్రానికి నిర్మాత దిల్‌ రాజు. దర్శకుడు తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.

కథలోకి వెళ్తే…. ముగ్గురు స్నేహితుల మధ్య సాగిన ప్రేమ కథాంశమే కేరింత సినిమా.

శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చిన  పార్వతీశం మరో  అయిదుగురు స్నేహితులను కలుస్తాడు. సుమంత్‌ అశ్విన్‌  ఓసారి ఓ అమ్మాయిని బస్సులో చూస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్  లా అతను ఆ అమ్మాయిని చూడటంతోనే ప్రేమించే పనిలో పడతాడు. ఆ ఆమ్మాయిగా  శ్రీదివ్య నటించింది. ఆమె అతనిని దూరంగానే పెడుతుంటుంది. కానీ అతను తన ప్రేమలో విజయం సాధిస్తాడు. మరోవైపు అతనిని ఇష్టపడినా శ్రీదివ్య తన ప్రొఫెషన్ కె అధిక ప్రాధాన్యం ఇస్తుంది.

ఇక  సంగీతం అంటే చెవికోసుకునే మ్యూజిక్‌ని ఇష్టపడే విశ్వంత్ కు అమ్మ అంటే చాలా భయం.   ఆ భయం వల్లే అతను అమ్మ దగ్గర రెండు విషయాలు దాస్తాడు. వాటిలో ఒకటి తాను  సంగీతం చదువుతున్నాను అనేది. మరొకటి – తేజస్వి అనే అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం. దాచిన ఈ రెండు విషయాల వల్ల అతను అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక  నూకరాజు ప్రస్తావనకు వస్తే, ఫేస్‌బుక్‌ వల్ల పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడి ఎంతో నష్టపోతాడు. అయితే భావన పాత్రలో నటించిన సుకీర్తి అనే మిత్రురాలుగా నూకరాజుని దారి తప్పకుండా చూస్తుంది.

భావోద్వేగాలను ప్రొజెక్ట్ చెయ్యడంలో యూనిట్ విజయవంతమైనట్టే చెప్పుకోవాలి.  అందుకే ఇదొక పాత చింతకాయ పచ్చడి కుర్రకారు సినిమాలా అనిపించదు.

నటన విషయానికి వస్తే సుమంత్‌ అశ్విన్‌, తేజస్వి, సుకీర్తి, అనితా చౌదరీ, పార్వతీశం బాగా చేసారు.  శ్రీదివ్య పాత్ర పరవాలేదు. విశ్వంత్ నటన సరేసరి.

Send a Comment

Your email address will not be published.