బాడ్మింటన్ పట్ల ఆసక్తి

నాగచైతన్య కథల ఎంపికలో తనకంటూ ఆచితూచి అడుగులు వేయడంతో ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నాడు. ప్రస్తుతం అతన ఓ సరికొత్త పాత్రతో మనముందు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడతను సెలెబ్రిటీ బాడ్మింటన్ లీగ్ టీంకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

నాగ చైతన్య మాట్లాడుతూ, బాడ్మింటన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ లీగ్ తో అనుబంధం పెంచుకోవడానికి ఓ అరుదైన అవకాశం వచ్చింది….నాకెంతో ఆనందంగా ఉంది….నేను తరచూ ఈ ఆట ఆడుతానని, అయితే అలాగని నేనేమీ గొప్ప క్రీడాకారుడిను కాను” అన్నాడు. నా ఆట సరదాగా సాగిపోయేదని, అంటే మిత్రులతో కలిసి సరదాగా ఆడుతుంటాం కదా అలాగే నేను ఆడతానని, అంతే తప్ప సీరియస్ గా కాదని చెప్పాడు.

ఇటీవల ఒలింపిక్స్ లో పీ వీ సింధు పతకం గెల్చుకుని దేశం యావత్తు గర్వించేలా చేసిందని, నిజం చెప్పాలంటే ఆమె ఇప్పుడు మన క్రీడాకారులను ఓ లక్ష్యం సాధించాలనే బాటలో నిలిపిందని అన్నాడు. అదే ఇప్పుడు తనను సెలెబ్రిటీ బాడ్మింటన్ లీగ్ కి చేరువ చేసిందని చెప్పాడు.

ప్రేమం అనే మలయాళం చిత్రం గురించి మాట్లాడుతూ ఆ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, ప్రత్యేకించి అందులోని “ఎవరే…” అనే పాట చాలా బాగా వచ్చిందని తెలిపాడు నాగచైతన్య.
టాలీవుడ్ లో నాగచైతన్యకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు గౌతం మీనన్. చిత్రం పేరు “ఏం మాయ చేసావే”.

నాగచైతన్య, తమిళంలోనూ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయా”

ఇందుకు అతను ఇలా సమాధానమిచ్చాడు –
“తమిళ పరిశ్రమ చాలా పెద్దది. ఇప్పటికే బోలెడు మంది నటులు ఉన్నారు. కనుక ఆ తమిళ పరిశ్రమలో ప్రవేశించడం అంత సులభం కాదు. మంచి స్క్రిప్ట్ గానీ వస్తే ఆ పరిశ్రమలో చేసే విషయాన్ని ఆలోచిస్తాను” అని.

Send a Comment

Your email address will not be published.