బాబోయ్ ఇంక కత్తి వద్దు!

కత్తి పట్టుకొని విలన్ల తలకాయలు నరకడం కంటే హీరో లతో ఆట పాటలే బాగుంటాయి అంటున్నారు అనుష్క. ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీ లలో అత్యంత భారీ వ్యయంతో నిర్మించే సినిమాలన్నిటిలో హీరోయిన్ అనుష్కానే. తెలుగులో ఎం. శ్యాం సుందర్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమాతో అనుష్కకు లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ అన్న పేరు వచ్చింది. అప్పటి వరకూ బికినీల్లోనూ, గ్లామర్ డాల్ గా చూసిన ప్రేక్షకులు మొదటి సారి గా అనుష్క లో ఉన్న నటనని చూసారు. జేజమ్మ గా కత్తి పట్టుకొని యుద్దాలు చేస్తే వహ్వా అన్నారు. ఆ సినిమాకి కనక వర్షం కురిపించారు. అప్పటి నుంచి భాషా భేదం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలకి అనుష్కే హీరోయిన్. గుణ శేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి సినిమా లోను, ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి సినిమాల్లోనూ నటిస్తోంది.ఈ సినిమాల బడ్జెట్ 50 కోట్ల పై మాటే. అంతే కాకుండా తమిళ్ లో భారీ గా నిర్మించిన వర్ణ సినిమాలోనూ నటించింది. ఈ మూడు సినిమాల కోసం కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ వంటి విద్యలు కస్టపడి నేర్చు కొంటోంది. ఈ సినిమాల తర్వాత ఇక కత్తి పట్టుకునే పాత్రల్లో చేయనని, కేవలం హీరో లతో ఆడి పాడే పాత్రలు మాత్రమే చేస్తానని అనుష్క వర్ణ ఆడియో వేడుకల్లో ప్రకటించింది.

Send a Comment

Your email address will not be published.