బాలయ్య తల్లిగా హేమమాలిని

hemamaliniదక్షిణాదిలో నటిగా వెండితెరపై శ్రీకారం చుట్టినా బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి హేమమాలిని ఇప్పుడు మళ్ళీ తెలుగులో నటిస్తోంది…..
ఆమె చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో కనిపించబోతోంది.
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో ఆమె బాలకృష్ణకు తల్లిగా నటిస్తోంది. ఆమె పాత్ర పేరు గౌతమీ బాలశ్రీ.

ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేసారు.
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రమే గౌతమీపుత్ర శాతకర్ణి .
ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లిగా నటించాలని దర్శకుడు కథ చెప్పడంతోనే హేమమాలిని అందుకు సమ్మతించింది.

హేమమాలిని, బాలకృష్ణ, శ్రేయలపై సన్నివేశాలను చిత్ర యూనిట్ ఈ మధ్యే పూర్తి చేసింది.
ఈ చిత్రంలో హేమమాలిని పాత్ర చాలా కీలకమైనది అని యూనిట్ తెలిపింది.
ఇలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి హేమమాలిని ఇప్పటికే కొంత సమయం కేటాయించడానికి ఒప్పుకున్నారట.

Send a Comment

Your email address will not be published.