బాలయ్య శతకం

ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ బాలకృష్ణ వందో చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారని…?

బహుశా బోయపాటి శ్రీనివాస్ లేదా సింగీతం శ్రీనివాస రావు ఈ ప్రతిష్టాత్మక బాలయ్య వందో సినిమాకు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ మహత్తర అవకాశం అనిల్ రావిపూడిని వరిస్తుందని తాజాగా తెలుస్తోంది. పటాస్ చిత్రంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన అనిల్ ఇటీవల చక్కటి కథతో బాలయ్యని కలిసినట్టు, కథను వినిపించినట్టు, ఆ కథ బాలయ్యకు నచ్చినట్టు సన్నిహిత వర్గాల భోగట్టా.

బాలయ్య ఆ కథకే మరిన్ని హంగులు చేయమని చెప్పినట్టు కూడా తెలియవచ్చింది. ఈ చిత్రానికి రామారావు గారు అని టైటిల్ కూడా ఖాయం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తారని టాక్.

ప్రస్తుతం అనిల్ రావిపూడి సుప్రీం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రంలో సాయి ధరం తేజ్ కథానాయకుడు.

మరోవైపు బోయపాటి శ్రీనివాస్ సరైనోడు చిత్రంతో బిజీగా ఉన్నారు.

Send a Comment

Your email address will not be published.