బాలీవుడ్ నెంబర్ వన్

సెక్సియస్ట్ ఉమెన్ గా ఇప్పటికే పేరు గడించిన దీపికా పడుకొనే ఇప్పుడు బాలీవుడ్ లో మేటి కథానాయికగా అగ్రస్థానంలో నిలిచింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, సోనాక్షి సిన్హా, ప్రియాంకా చోప్రా వంటి తారలను తలదన్ని దీపికా ఇప్పుడు బాలీవుడ్ లోకంలో నంబర్ వన్ కథానాయికగా మొదటి స్థానాన్ని సంపాదించినట్టు ఒక సర్వే పేర్కొంది.

అందుకు  కారణం ఆమె సాధించిన చిత్రాల విజయాలతోపాటు సోషల్ నెట్ వర్క్ లో ఆమెకు అభిమానులు మిగిలిన వారికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండటమే అని ఆ సర్వే తెలిపింది.

సినిమాలతో కోట్ల వసూళ్ళ రాణిగా గుర్తింపు పొందిన దీపికాకు సోషల్ వెబ్ సైట్ లలో పదిహేను మిలియన్ల అభిమానులు ఉన్నారని తెలియవచ్చింది.

ఇటీవల ఓ ఫిలిం మ్యాగజైన్ హాతీయ స్థాయిలో ఈ సర్వే ను నిర్వహించింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్ లకు పది శాతం, సోనాక్షి సిన్హా కు ప్రియాంకా చోప్రాకు తొమ్మిది శాతం వోట్లు రాగా దీపికకు పదమూడు శాతం వోట్లు వచ్చాయి. దీనితో ఆమె బాలీవుడ్ లో నెంబర్ వన్ కథానాయికగా అగ్రస్థానంలో నిలిచింది.

ముఖ్యంగా షారుక్ ఖాన్ తో ఆమె తొలి సారి నటించిన ఓం శాంతి ఓం చిత్రానికి ఎక్కువ వోట్లు పడ్డాయి.

ఈ చిత్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి.  అందులో ఉత్తమ నటిగా దీపిక భాగస్వామి కావడం విశేషం.

Send a Comment

Your email address will not be published.