బాల నటి నుంచి...

నిత్య శెట్టి …..

దాదాపు ఇరవై చిత్రాలలో బాలనటిగా నటించిన నిత్య శెట్టి ఇప్పుడు ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ చిత్రం పేరు దాగుడు మూతా దండాకోర్.

“బాలనటిగా దాదాపు ఇరవై  సినిమాల్లో నటించిన తర్వాత నేను కాస్త బ్రేక్ తీసుకున్నాను. మా అమ్మకి నేను నా చదువుసంధ్యలు పూర్తి చేసుకోవాలని కోరిక. ఆ తర్వాతే సినిమాలోకి రావాలని చెప్పింది…” అని చెప్పిన నిత్య శెట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది.

తాన బాలనటిగా నటించిన సినిమాలలో కొన్ని చిత్రాలే గుర్తు ఉన్నాయని, తాను కొన్ని మంచి చిత్రాలు చెయ్యాలని ఆశ పడుతున్నానని ఆమె చెప్పింది.

అయిదేళ్ళ తర్వాత నేను వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు మంచి సినిమాల్లో నటించాను అనే పేరు మిగిలిపోవాలి తప్ప అరె నేను అలా ఏమాత్రం పైకి చెప్పుకోలేక పోయిన చిత్రాలు చేసేనేమిటి అనే బాధ మిగిలిపోకూడదు అన్నదే నా అభిప్రాయమని ఆమె తెలిపింది.

చిత్రాలంటే అవి గ్లామర్ చిత్రాలు కావచ్చు లేదా కమర్షియల్ చిత్రాలు కావచ్చు లేదా ఆర్ట్ ఫిలిం కావచ్చు…మొత్తం మీద మంచి చిత్రం చేసేనా లేదా అన్నదే నాకు ముఖ్యమని నిత్యా శెట్టి చెప్పింది.

అలనాటి తారల్లో తనకు సావిత్రి అంటే తనకెంతో ఇష్టమని, తాను ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాలతో బిజీ అయినా మంచి తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్నానని, టాలీవుడ్ నుంచి కొన్ని ఆఫర్లు వస్తున్నాయని, అయితే తను ప్రధాన పాత్రలో నటించిన దాగుడు మూత దండాకోర్ తెలుగు చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారా అనే దానికోసం చూస్తున్నానని ఆమె చెప్పారు.

Send a Comment

Your email address will not be published.