బాహుబలి పాత్రలు

భారతీయ చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం అనుకుంటున్న బాహుబలి చిత్రంలోని పాత్రల పరిచయ కార్యక్రమం తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయం స్టేడియం లో కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో జూన్ 13 వ తేదేన జరిగింది.

శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి చిత్రాన్ని కె రాఘవేంద్ర రావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో నటించిన ప్రధాన పాత్రదారులలో కొందరు తమ పాత్రను ఒకటి రెండు ముక్కల్లో చెప్పుకున్నారు. వారి వారి వీడియోలను కూడా ప్రదర్శించారు.

బాహుబలి
పిల్లాడుగా ఉన్నప్పుడు సాధ్యం కాకపోయిన కోరికను పెద్దవాడయ్యాక తాననుకున్న ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ దెయ్యాలు కనిపించవు. ఓ దేవకన్యలాంటి అమ్మాయి కనిపిస్తుంది. ఆమె కోసం జలపాతం నుంచి దూకేస్తాడు. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి …నేనెవర్ని అని ప్రశ్నిచులున్న బాహుబలి పాత్ర్తలో ప్రభాస్ కనిపించాడు. పెద్ద సినిమా చేద్దామని రాజమౌళి చెప్పినప్పుడు ఏదో అనుకున్నానని. అయితే ఇంత పెద్ద సినిమా చేస్తారనుకోలేదని ప్రభాస్ అన్నారు.

భల్లాలదేవ
ఇతను ఓ యువరాజు. ఆయన శక్తికి తిరుగులేదు. అతని బలానికి పోలికే లేదు. అతని ఆలోచనలను ఎవరూ చదవ లేరు …అలాంటి పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో రానా నటించారు. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెర మీద సందడి చేసిన తీరు చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. విలన్ గా నటించడమేమిటని అడిగిన వారికి రానా జవాబిస్తూ కాలం అనేది కరిగిపోయే క్షణాలు అయితే ఈ బాహుబలి కలకాలం నిలిచిపోయే శిల్పం కనుక విలన్ పాత్ర చేయడానికి ముందు వెనుకలు ఆలోచించలేదని అన్నారు. మనకు రామాయణం ఎలాంటిదో వెండితెరపై బాహుబలి అలాంటిదని అన్నారు రానా.

బిజ్జలదేవ
ప్రతి పలుకులోను విషం…ప్రతి అడుగులోనూ ఈర్ష్య….ప్రతి ఆలోచన వెనుకా ఓ వంచ….ఈ పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ అని నాజర్ చెప్పారు. ఆ పాత్రకు అవసరమైన లక్షణాలను అన్నింటికీ అన్ని విధాల న్యాయం చేసిన నాజర్ అంతర్ దృష్టితో ఆలోచించి నటించారు.

కాలకేయ
రక్తం అతని దాహాన్ని తీరుస్తుంది. హింస అతన్ని శాంతపరుస్తుంది…అతడే లక్ష మంది ఆటవిక ప్రజల నాయకుడు కాలకేయ. కాలకేయుడిగా నటించిన ప్రభాకర్ కొన్ని డైలాగులు చెప్పి అందరి మన్ననలూ పొందారు.

కథానాయికలలో ఒకరైన అనుష్కా మాట్లాడుతూ నాయుడు గారు మొదట్లో చేసిన మేకప్ కుదరలేదని, అనంతరం నెల రోజుల పాటు రకరకాల పుస్తకాలు చదివి చాలా మందితో చర్చించి తనకు మేకప్ చేసారని తన అనుభవాలను చెప్పారు. ఈ చిత్రం తనకు ఓ మరచిపోలేని అనుభూతని అన్నారు.

బాహుబలిని ప్రపంచం ముందుకు రియలిస్టిక్ గా తీసుకురావడానికి యూనిట్ మొత్తం శ్రమించిందని తమన్నా చెప్పారు.

ఇలా ఒక్కొక్కరూ తమ పాత్రానుభావాలను టూకీగా చెప్పినప్పుడల్లా ఆ ప్రాంతం చప్పట్లతో మారుమోగింది.

ఇదిలా ఉండగా రాజమౌకి మాట్లాడుతూ కథ కోసం ఓ ఏడాది, షూటింగు కోసం రెండేళ్ళు,…పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలలు శ్రమించినట్టు చెప్పారు. అయిదేళ్ళ క్రితమే ఈ చిత్రానికి ప్రభాస్ హీరో అని తాను ఫిక్స్ అయినట్టు చెప్పారు. అన్నయ్య కీరవాణి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పిన రాజమౌళి రానా, అనుష్కా, తమన్నా, రమ్యకృష్ణ తదితరుల గురించి కూడా మాట్లాడారు.

చివరగా ఈ చిత్రం జూలై పదో తేదీన విడుదల అవుతుందని రాజమౌళి ప్రభాస్ తో చెప్పించినప్పుడు ఆ ప్రాంతం హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. .

Send a Comment

Your email address will not be published.