అదిరిపోయిన ప్రభాస్

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి టీజర్ విడుదల అయింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి బాహుబలి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వేల కొద్దీ లైక్ లు ఫేస్ బుక్ ని ముంచెత్తాయి. ఆరడుగల అందగాడు ప్రభాస్ ఈ లుక్ లో చందమామ కధల్లో రాకుమారుడి లాగా ఉన్నాడని ఆడపిల్లలు అంటున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా కోసం కష్టమైన కసరత్తుల తో పాటు సుమారు 150 కిలోల బరువు పెరిగాడు. మరో రెండు సంవత్సరాల పాటు ఇంకే సినిమాకి పని చేయడు. అనుష్క హీరోయిన్. ప్రేక్షకులు ఈ సినిమాపై మగధీర సినిమా కంటే ఎక్కువ అంచనాలతో ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల కావడానికి మాత్రం మరో రెండు సంవత్సరాల సమయం ఉంది. 2015 లో ఈ సినిమా విడుదల కావచ్చు.

Send a Comment

Your email address will not be published.