ఉషా కిరణ్ ఫిలిమ్స్ , అనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమే బీరువా. జనవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. కన్మణి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాత రామోజీ రావు. ఎస్.ఎస్.తమన్ స్వరపరిచిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ , సురభి , నరేష్ , చలపతిరావు , అజయ్ అనిత చౌదరి తదితరులు నటించారు.
చిత్రంలో సంజు పాత్రలో నటించిన సందీప్ కిషన్ ఓ పెద్ద వ్యాపారవేత్త పుత్రుడు. అతను పనీ పాటా లేకుండా తిరుగుతుంటాడు. వ్యాపారి నరేష్ కి ఓ సమస్య వస్తుంది. తనను సమస్యనుంచి గట్టెక్కించమని ఒకరిని ఆశ్రయిస్తాడు.ఆ సమయంలోనే సందీప్ కిషన్ నరేష్ ఎవరి సహయమైతే కోరుతాడో ఆ వ్యక్తి కూతురైన సురభి ప్రేమలో పడతాడు. .కొంతకాలానికి ఈ ప్రేమికులిద్దరూ పారిపోతారు. వీరి ప్రేమ మలుపులతో ముడిపడిన కథ తెలుసుకోవాలంటే బీరువా సినిమా వెండితెరపై చూడాలి.
హీరోగా సందీప్ కిషన్ తన పాత్రకు ఏ మాత్రం లోటు రానియ్యక నటించాడు. మరోవైపు కథానాయిక సురభి అందం చూడదగ్గదే. అందానికి తగ్గ నటన కూడా ఆమెలో ఉందని చెప్పుకోవచ్చు. కామెడీ పరవాలేదు. నరేష్ నటన గురించి విడిగా చెప్పక్కర్లేదు.
తమన్ స్వరపరచిన పాటలు పరవాలేదు. వెలిగొండ శ్రీనివాస్ రాసిన మాటలకు ప్లస్ మార్కులు పడ్డాయి.
ఈ సినిమా విషయంలో తొలుత కొన్ని సందేహాలు తలెత్తినా “జెమిని” కిరణ్ కథ వినమని చెప్పడంతో విన్నానని హీరో సందీప్ కిషన్ చెప్పారు. వినగా కథ తనకెంతో నచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. తన నట జీవితంలో ఇదొక చెప్పుకోదగ్గ చిత్రమని కూడా ఆయన అన్నారు. కొత్తదనం, వినోదం కలిసిన చిత్రమే బీరువా అని, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం తర్వాత తాను ఇష్టపడి చేసిన సినిమా బీరువా అని సందీప్ తెలిపారు. కథంతా బీరువాను కేంద్రబిందువుగా చేసుకునే సాగుతుందని అన్నారు. తన ప్రేమను గెలిపించుకోవడానికి ‘బీరువా’ను ఏ విధంగా ఉపయోగించుకున్నానో ప్రేక్షకులే చూసి చెప్పాలని ఆయన అన్నారు.